Saturday, 18 April 2026 06:40:29 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆధార్ సేవల సవరించిన ఛార్జీల వివరాలు ప్రతి కేంద్రంలో స్పష్టంగా ప్రదర్శించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 October 2025 03:56 PM Views : 444

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/5 అక్టోబర్/ అక్షరం న్యూస్: భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ( యు ఐ డి ఏ ఐ ) ఆధార్ సేవలపై సవరించిన కొత్త రుసుములు 2025 అక్టోబర్ 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయని అన్నారు. ప్రజలకు ఈ మార్పులపై పూర్తి అవగాహన కల్పించే విధంగా అన్ని ఆధార్ సేవా కేంద్రాల్లో కొత్త రుసుముల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఒక ప్రకటన తెలిపారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ బయోమెట్రిక్ అప్‌డేట్ (ఫింగర్ప్రింట్, ఐరిస్, ఫోటో) కోసం రేట్లు ఇలా ఉన్నాయి: 5-7 ఏళ్ళ పిల్లలకు ఒకసారి అప్‌డేట్ చేయడం ఫ్రీ, 15-17 ఏళ్ళ పిల్లల కోసం ఒకసారి ఫ్రీ. మిగతా సందర్భాల్లో రూ 125 వసూలు అవుతుంది.డెమోగ్రాఫిక్ అప్‌డేట్ అంటే పేరు, లింగం, జన్మతేదీ, చిరునామా, మొబైల్, ఇమెయిల్ వంటి వివరాలను మార్చడం. బయోమెట్రిక్ అప్‌డేట్ తో పాటు చేస్తే ఫ్రీ, వేరుగా చేస్తే 75 రూపాయలు వసూలు. డాక్యుమెంట్ అప్‌డేట్ అంటే ఐడి, చిరునామా డాక్యుమెంట్స్ సమర్పించడం. మై ఆధార్ పోర్టల్ ద్వారా చేస్తే ఫ్రీ, ఎన్‌రోల్మెంట్ సెంటర్ ద్వారా చేస్తే 75 రూపాయలు వసూలు.హోమ్ ఎన్‌రోల్మెంట్ సర్వీస్ కోసం ఫీజు 700 రూపాయలు . ఒకే చిరునామాకు బహుళ మంది తీసుకుంటే మొదటి వ్యక్తికి 700 రూపాయలు, మిగతా వ్యక్తులకి 350 చార్జ్. ఆధార్ డౌన్‌లోడ్ చేసి ముద్రించుకోవడానికి రూ.40 చెల్లించవలసి ఉంటుంది అని అన్నారు.జిల్లా ప్రజలు ఆధార్ సంబంధిత సేవల కోసం కేవలం అధికారిక ఆధార్ సేవా కేంద్రాలు లేదా గుర్తింపు పొందిన సెంటర్లను మాత్రమే వినియోగించాలనీ, ప్రజల్లో ఏ విధమైన అపోహలు లేకుండా సవరించిన రుసుములపై విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :