DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి ప్రతినిధి జనవరి 27 అక్షరం న్యూస్; పెద్దపల్లి మున్సిపల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కొలిపక శ్రీనివాస్‌ను ప్రకటిస్తూ ‘సింహం’ గుర్తు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రజల నుంచి ఎదిగిన నాయకుడు ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… పెద్దపల్లి ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి ఆశయాలకు ప్రతిబింబంగా నిలిచే నాయకుడు కొలిపక శ్రీనివాస్ అని అన్నారు. ప్రజల మధ్య నుంచే ఎదిగిన వ్యక్తిగా మున్సిపల్ పాలనలో పారదర్శకత, సమానత్వం, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఆయనకు ఉందని స్పష్టం చేశారు. సింహం గుర్తుపై ప్రజల తీర్పు తెలంగాణ జాగృతి సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా సింహం గుర్తుపై పోటీ చేస్తున్న కొలిపాక శ్రీనివాస్‌ను పెద్దపల్లి ప్రజలు ఘన విజయానికి నడిపిస్తారని కవిత విశ్వాసం వ్యక్తం చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలు పట్టణ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఎన్నికలుగా మారనున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. మున్సిపాలిటీలో మార్పే లక్ష్యం ... తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… పెద్దపల్లి మున్సిపాలిటీలో మార్పు, ప్రజాపాలన, సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో సింహం గుర్తు ప్రజల నమ్మకానికి ప్రతీకగా నిలవనుందని తెలిపారు. అభివృద్ధి – సంక్షేమమే అజెండా కొలిపక శ్రీనివాస్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధి పేదల సంక్షేమం యువతకు ఉపాధి అవకాశాలు మహిళల భద్రత వంటి అంశాలపై బలమైన ప్రజా పాలన ఏర్పాటు చేయడమే తెలంగాణ జాగృతి ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. బీసీల ఐక్యతలో కీలక పాత్ర గతంలో మున్సిపల్ కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం ఉన్న కొలిపక శ్రీనివాస్, ముదిరాజ్ సామాజిక వర్గంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బీసీలను ఐక్యం చేయడంలో తనవంతు కృషి చేసి, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కార్యక్రమానికి విశేష స్పందన ఈ కార్యక్రమంలో కొలిపక సంపత్, గంగుల సతీష్, సంతోష్, నరేష్, చందు తదితరులు పాల్గొని కొలిపక శ్రీనివాస్‌కు మద్దతు ప్రకటించారు.
.
Aksharam Telugu Daily