AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 29/ అక్షరం న్యూస్/--- సేవ చేయాలనే సంకల్పం ఉంటే ఎన్ని అవరోధాలు ఎదురైనా అవి పూసుకు పుల్లతో సమానం అని నిరూపిస్తూ ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ సభ్యులు ముందుకు దూసుకు పోతున్నారు. ఏ స్వార్థం లేకుండా సేవా కార్యక్రమాలు చేస్తూంటే గుర్తింపు దానంతట అదే వస్తుంది అని అనడానికి ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ సభ్యులే అని అనడంలో అతిశయోక్తి లేదు. ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ముగ్ధులై కమిటీ సభ్యులకు మరింత ప్రోత్సాహాన్ని అందించాలని పాకలపాటి సత్యనారాయణ రాజు ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ కు ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందించి మంచి మనసును చాటుకున్నాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐశ్వర్య మహిళా శక్తి అసోసియేషన్ సభ్యులు తేగడ గ్రామం లో ప్రజాసేవ చేస్తూ దినదినాభివృద్ధి చెందుతూ ముందుకు సాగుతున్నారని ఆయన అన్నారు. భవిష్యత్త్ లో కూడా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని వాటికి నావంతు సహయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు.
.
Aksharam Telugu Daily