Wednesday, 18 November 2026 12:30:30 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తల్లాడ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ ..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 17 November 2026 09:14 PM Views : 211

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ తల్లాడ నవంబర్ 17 (అక్షరం న్యూస్) తల్లాడ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ స్టేషన్ నిర్వహణ, స్టేషన్‌లోని రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలు, కేసుల దర్యాప్తు పురోగతిని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను, సిబ్బంది పనితీరును పరిశీలించిన కమిషనర్, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, నేర నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్బంగా సెక్టర్ అధికారులు, పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్స్ లో వస్తున్న అధునాతన పద్ధతులను అందిపుచ్చుకోవాలాని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్లలో డేటా నమోదు, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, సాంకేతికతను మెరుగుపరచడంలో ఈ వ్యవస్థ అత్యంత కీలకమని స్పష్టం చేశారు.జిల్లాలో వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్న వారిని కనిపెట్టేందుకు ఈ ప్రాజెక్టులో నూతన పద్ధతులు ప్రవేశపెడుతున్నారని , వాటిపై పరిణితి సాధించాలని సూచించారు. ఉన్నతాధికారులు ప్రాజెక్టును సమర్థవంతంగా ఉపయోగించాలని..... తద్వారా క్రింది స్థాయి సిబ్బంది మరింత మెరుగ్గా వినియోగించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రాజెక్టులో భాగంగా ఈ-సమన్స్, ఈ-సాక్ష్యా వంటి వాటిని విస్తృతంగా ఉపయోగించాలని వివరించారు. రౌడీ షీటర్ల ను కౌన్సిలింగ్ చేయాలని, అదేవిదంగా నిఘా పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైరా సీఐ వెంకట ప్రసాద్, ఎస్ఐలు ఎన్ వెంకటకృష్ణ, వెంకటేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :