GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/హుజురాబాద్ : * * కరీంనగర్/హుజురాబాద్/జనవరి 8/అక్షరం న్యూస్: రాష్ట్రంలో జరగనున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో అధికార పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలు ముగ్గు చూపుతున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే జమ్మికుంట, హుజరాబాద్ మున్సిపాలిటీలో మొత్తం కలిపి 60 కౌన్సిలర్ ఉన్నాయి. జమ్మికుంటలో హుజురాబాద్ లో మహిళ ఓటర్ల సంఖ్యని అధికంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మహిళల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ వస్తుంది ఎలక్షన్ ముందు మహిళలకు ఏవైతే హామీలు ఇచ్చిందో ఒకదాని వెంట ఒకటి అమలు చేసుకుంటూ మహిళల యొక్క అభిమానాన్ని చూరగొన్నారు. వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే మహిళా ప్రభుత్వం అనే విధంగా సంక్షేమ పథకాలను తీసుకొస్తూ దూసుకుపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం పది సంవత్సరాలు నిరక్షించిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, మహిళా సంఘాలకు రుణాలు ఇలా చెప్పుకుంటూ పోతే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం లో పెద్దపీట వేస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వైపే ప్రజలు చెపుతున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ బాబు నేతృత్వంలో గ్రామ గ్రామనా కాంగ్రెస్ పార్టీ బలోపేతం. హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ ప్రణవ్ నాయకత్వంలో ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదిగి గ్రామపంచాయతీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సత్తా ప్రణవ్ బాబు నాయకత్వానికి బలం చేకూరింది. అదేవిధంగా నియోజకవర్గ పరిధిలోని హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలో కూడా ప్రణవ్ ప్రత్యేక చదువుతో రెండు మున్సిపాలిటీల పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం లో ఇంచార్జ్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ఎలాంటి హంగు ఆర్భాటలు లేకుండా ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ వారికి అండగా ఉంటున్న ప్రణవ్ బాబు నాయకత్వంలోనే హుజురాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మకంతో ఈ ప్రాంత ప్రజలు ఉన్నారని మేధావులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే వర్గ పోరు ఉంటుందని వినికిడి ఉన్నా కానీ హుజరాబాద్ నియోజకవర్గం లో అలాంటి వాటికి తావు లేకుండా పార్టీ సీనియర్ నాయకులను యువతను సమన్వయం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందే విధంగా తన వంతు కృషి చేస్తూ స్థానిక మంత్రుల సహకారం తీసుకుంటూ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రణం నాయకత్వంలో మునిసిపల్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ప్రజలు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
.
Aksharam Telugu Daily