AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల అక్టోబర్ 10/ అక్షరం న్యూస్/--- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి సరిహద్దున ఉన్న మారుమూల గ్రామం చర్ల యందు నిరుపేద నాయి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన గోరింట్ల వెంకటేశ్వరరావు పద్మా దంపతుల కుమార్తె ధన్య శ్రీ సూర్యాపేట గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నందు నాలుగో సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తుంది. నిరుపేద విద్యార్థికి ప్రోత్సాహాన్ని అందించడం కోసం మంచి మనసుతో చర్ల ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ డి ఈ ప్రభాకర్ సహృదయంతో విద్యార్థి ఉన్నత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన వంతు సాయంగా పదివేల రూపాయల ఆర్థిక సహయాన్ని అందించి వైద్య విద్యార్థి ధన్య శ్రీ కి ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి మారుమూల గ్రామంలో సరైన విద్యా సౌకర్యాలు లేనప్పటికీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని వైద్య విద్యా రంగంలో రాణిస్తున్నటువంటి గోరింట్ల ధన్య శ్రీ కి తన వంతు సహాయంగా ఆర్థిక సహాయాన్ని అందించడం ఆనందించదగ్గ విషయమని ఆయన అన్నారు. ధన్య శ్రీ తను ఎంచుకున్న మార్గంలో పట్టువదలని విక్రమార్కురాలుగా తను ఎంచుకున్న విద్యను అభ్యసించి ఎంతో ఉన్నతమైన స్థానంలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఉన్నతమైన విద్యను అభ్యసించి వైద్యురాలిగా కొనసాగుతూ నిరుపేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి గా నిలచి పలువురు కు వైద్య సేవలను అందించాలచాలని ఆయన అన్నారు. తన కుమార్తెకు వైద్య విద్యను అందించడానికి ఆర్థిక సహాయం అందించిన ఏ డి ఈ ప్రభాకర్ కు తల్లిదండ్రులు గోరింట్ల వెంకటేశ్వరరావు పద్మా దంపతుల హృదయ పూర్వకమైన కృతజ్ఞతాభివందనములు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily