Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్,పెద్దపల్లి జిల్లా మే 17 అక్షరం న్యూస్: మోటార్ బైక్ అదుపుతప్పిన వ్యక్తికి తీవ్ర గాయాలు అయిన సంఘటన కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం శ్రీరాంపూర్ మధ్యలో జరిగింది శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన వెంకటకృష్ణ శుక్రవారం రాత్రి శ్రీరాంపూర్ వైపు వెళ్తుండగా గంగారం దాటిన తర్వాత ఎస్సారెస్పీ కెనాల్ దగ్గర రాయికి తగిలి బైకు అదుపుతప్పి పడిపోగా వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి రాత్రి ఈ సంఘటన జరగడంతో అటువైపుగా ఎవరు వెళ్లకపోవడంతో ఉదయం వాకింగ్కు వచ్చేవారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వెంటనే పుటాహుటిన సంఘటన స్థలానికి వచ్చి 108 వాహనంలో పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు
.
Aksharam Telugu Daily