GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/రామగిరి : - రామగిరి (పెద్దపెల్లి జిల్లా) ఏప్రిల్ 13 అక్షరం న్యూస్: ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసి ప్రజల హృదయాలలో నిలిచిన వ్యక్తి దుద్దిల్ల శ్రీపాదరావని ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివారం రామగిరి మండలంలోని రామయ్య పల్లె స్టేజ్ వద్ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 26వ వర్ధంతి ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ శ్రీపాద రావు సేవలు చేసిన చిరస్మరణీయం అని రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న తాజా మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్ తోట చంద్రయ్య బర్ల శ్రీనివాస్ మాజీ సర్పంచ్ బుద్దారి బుచ్చయ్య,దేవునూరి రజిత శ్రీన
.
Aksharam Telugu Daily