Saturday, 18 April 2026 01:17:18 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మహిళల రక్షణకోసం షీ టీంలు


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 02 December 2025 03:16 PM Views : 430

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/డిసెంబర్-02(అక్షరం న్యూస్) సోషల్ మీడియాలో అపరిచితుల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థినులు, మహిళల భద్రత కోసమే షీ టీంలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని షీ టీం సభ్యులు తెలిపారు. మంగళవారం జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే సూచనల మేరకు జిల్లా షీ టీమ్ ప్రతిరోజూ విద్యాసంస్థలు,మహిళలు పని చేసే ప్రదేశాలను సందర్శిస్తూ గుడ్ టచ్ / బ్యాడ్ టచ్, ర్యాగింగ్, ఇవిటీజింగ్, పోక్సో చట్టం, షీ టీమ్ సేవలు, మహిళా చట్టాలపై అవగాహన కార్యక్రమాలభాగంగా ముస్తాబాద్ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో ని ప్రభుత్వ పాఠశాల లను షీ టీం బృందం సందర్శించారు. విద్యార్థుల కు అవగాహనా కల్పించారు. విద్యార్థులను ఎవరైనా లైంగిక వేధింపులకు గురైతే వెంటనే షీ టీం నెంబర్ 8712656425 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. లోన్‌ యాప్‌లు, మొబైల్‌ ఫోన్లలో వచ్చే ఫేక్‌ కాల్స్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని అన్నారు గత నెలలో జిల్లాలో వేధింపులకు పాల్పడిన వారిపై రెండు ఎఫ్ ఐర్ కేసులు నమోదు చేసి వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించామని తెలిపారు. సోషల్ మీడియా లో అపరచిత వ్యక్తులకు స్పందించకూడదని గుర్తు తెలియని వ్యక్తులతో వ్యక్తి గత సమాచారం పంచుకోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఏఎస్‌ఐ ప్రమీల, వీరయ్య, సిబ్బంది శ్రీలత, ప్రియాంక, శ్రీనివాస్‌తో పాటు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :