Wednesday, 04 March 2026 01:46:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సుల్తానాబాద్ ఆస్పత్రిలో కాంట్రాక్టర్ సొంత "మెనూ" ... మేము పెట్టిందే రోగులు తినాలి .

కాంట్రాక్టర్ దే ఇష్టా రాజ్యం.. .... రోగులకు అందని పౌష్టిక ఆహారం ... పట్టించుకోని ఆరోగ్య శాఖ అధికారులు .... అనుభవం లేని స్వశక్తి సంఘం సభ్యురాలికి కాంట్రాక్ట్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 03 April 2025 07:49 PM Views : 2112

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... దొమ్మటి రాజేష్, పెద్దపల్లి, అక్షరం ప్రతినిధి అనారోగ్య కారణాలు తో పాటు ప్రసవం వేదనతో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగుల కోసం అమలు చేస్తున్న ఉచిత పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం పక్కదారీ పడుతుంది. ఆరోగ్యశాఖ అధికారులు చూసీచూడనట్టు వదిలి పెట్టడంతో ప్రభుత్వా నిబంధనలకు విరుద్ధంగా ఓ కాంట్రాక్టర్ తన సొంత "మెనూ" అంటే తనకు నచ్చిన ఆహారం అందిస్తున్నారు. దీంతో లక్షల రూపాయలు వెచ్చించి రోగుల కోసం అమలు చేస్తున్న పౌష్టిక ఆహార పంపిణీ అనేక లోపాలతో విఫలం అవుతుందన్న ఆరోపణలు వినవస్తున్నాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ముప్పై పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో అమలవుతున్న పౌష్టికాహార పంపిణీ ఇందుకు ప్రధాన నిదర్శనంగా చెప్పవచ్చు. ఇక్కడ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్న స్వశక్తి సంఘం సభ్యురాలు సొంత మెనూ అమలు చేస్తుండడంతో రోగులకు నాణ్యమైన ఆహారం అందరం అందడం లేదన్న ఆరోపణలు సర్వత్ర వినవస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్న రోగులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా ఇడ్లీ సాంబార్, చెట్ని, లేదా పొంగల్ కిచిడి లేదా ఉప్మా లేదా బ్రెడ్ తో పాటు పాలు ఉడికించిన గుడ్డు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట రైస్ లేదా పుల్కా తో పాటు ఒక కాయ కూర, ఆకుకూర పప్పు, సాంబారు తో పాటు ఉడికించిన గుడ్డు పెరుగు లేదా మజ్జిగ ఒక అరటిపండు పెట్టాలి. సాయంత్రం డిన్నర్ లో రైస్ లేదా పుల్కా, ఒక కూర తో పాటు ఆకు కూర, సాంబారు, ఉడికించిన గుడ్డు, పెరుగు లేదా మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్నింటికే పరిమితం... అయితే సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడి కాంట్రాక్టర్ సొంత మెనూ అమలు చేస్తుండడంతో ఆహార పంపిణీ కోన్నింటికే పరిమితం అవుతుంది. మూడు పూటలా ఉడికించిన గుడ్డు ఒక మధ్యాహ్నం పూటనే ఇస్తున్నారు. అలాగే అరటిపండు పెరుగు లేదా మజ్జిగ పాలు బ్రెడ్డు రోగులకు పెట్టడం లేదు. అల్పాహారంలో పొంగల్ కిచిడి బ్రెడ్ ఇవ్వడం లేదు. తక్కువ దొరికే కాయగూరలు పెడుతూ పౌష్టికారం ఇవ్వడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. ఆహారం కూడా సరిగా ఉండకపోవడంతో తాము తినలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సందర్భాలలో మధ్యాహ్నం వండిన కూరలే పెడుతున్నారని, ఉదయం అల్పాహారంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ అందిస్తున్నారని వారు తెలిపారు. స్వశక్తి సంఘ సభ్యురాలికి కాంట్రాక్ట్... సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల భోజన పంపిణీ కోసం గత 2022 సంవత్సరంలో టెండర్ నిర్వహించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం అల్పాహారంతో పాటు రెండు పూటలా భోజనం పెట్టడానికి 80 రూపాయలు గాను 79 రూపాయలకు జగిత్యాలకు చెందిన కాంట్రాక్టర్ ఎం శ్రీరాములు కాంట్రాక్ట్ దక్కించుకున్నారు. వాస్తవానికి రెండు సంవత్సరాలు కాంట్రాక్టు పొందగా, మరో సంవత్సరం కాంట్రాక్ట్ పొడిగించుకునే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం ఒకసారి కాంట్రాక్ట్ పొందిన వారు మూడు సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. రెండు సంవత్సరాల తర్వాత శ్రీరాములు తన కాంట్రాక్టు పొడిగింపు కోసం దరఖాస్తు చేయకపోవడంతో తాత్కాలికంగా అతని వద్ద సబ్ కాంట్రాక్టర్ గా పనిచేస్తున్న లక్ష్మీ అనే స్వశక్తి సంఘం సభ్యురాలుకు అధికారులు కాంట్రాక్ట్ అవకాశం కల్పించారు. ప్రభుత్వ నిబంధనలను ప్రకారం అనుభవం ఉన్న కాంట్రాక్టర్కు టెండర్ ప్రక్రియ ద్వారా కాంట్రాక్టు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం కోసం అధికారులు స శక్తి మహిళలకు టెండర్ ద్వారా కాకుండా పాత కాంట్రాక్టర్కు ఇచ్చిన విధంగానే అప్పగించారు. అనుభవం లేని మహిళా గ్రూపు సభ్యురాలు నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా ఆహారం అందిస్తుండడం విమర్శలకు దారితీస్తుంది. ???????????????????????????????????????????????????????? ఉప్మా, ఇడ్లీ తినలేకుండా ఉంది.. ... పర్ష శృతి, బాలింతరాలు, కొలనూరు గత నెల 26న ప్రసవం కోసం ఇక్కడ ఆసుపత్రిలో చేరాను. ఉదయం పూట ఉప్మా ఇడ్లీ పెడుతున్నారు. అవి తినలేకుండా ఉన్నాయి. ఒకరోజు అల్పాహారంలో ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు. ఇదేమిటని అడుగుతే తింటే తినండి లేదంటే లేదన్నారు. ఒక పూటనే ఎగ్గు పెట్టారు. అరటిపండు, పాలు, బ్రేడ్ ఇవ్వడం లేదు. మధ్యాహ్నం వండిన కూరలు మళ్లీ డిన్నర్ లో కూడా పెట్టడం తో తినలేకపోయాను. అధికారులు దీనిపై చర్య తీసుకోవాలి. ???????????????????????????????????????????????????????????? కూరలు తినకుండా ఉన్నాయి.. .... అంజలి, బాలింత స్త్రీ, సుల్తానాబాద్. ఆస్పత్రిలో ప్రసవం కోసం వచ్చాను. ఇక్కడ పెట్టే అన్నంలో కూరలు తినలేకుండా ఉన్నాయి. కాకర, బెండకాయ వంటివి పెడుతున్నారు ఆకుకూరలు పెట్టడం లేదు. ఒక పూటనే గుడ్డు పెడుతున్నారు. అరటిపండు, బ్రెడ్డు, పాలు ఇవ్వడం లేదు అన్నం కు బదులు రొట్టెలు కూడా ఇవ్వాలని అడుగుతే ఇవ్వడం లేదు. ఆహారం పంపిణీ చేసేవారు నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు. ???????????????????????????????????????????????????????????????? ఆహార పంపిణీ రోజు పరిశీలిస్తున్నాం.. ... ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమాదేవి ఆసుపత్రిలో రోగులకు ఆహార పంపిణీ విధానాన్ని ప్రతిరోజు తాము పరిశీలిస్తున్నామని ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ రమాదేవి తెలిపారు అయితే మీ పర్యవేక్షణ ఉండగా మెనూ ప్రకారం ఆహార పంపిణీ ఎందుకు అమలు జరగడం లేదని ప్రశ్నిస్తే అలాంటిది ఏమీ లేదని చెప్పుకు వచ్చారు. అయితే అక్కడే ఉన్న కాంట్రాక్టర్ లక్ష్మీ భర్త తాను పాత కాంట్రాక్టర్ చెప్పిన విధంగానే పెడుతున్నానని, మెనూ ప్రకారం పెట్టడం లేదని అంగీకరించారు. అయినా డాక్టర్ రమాదేవి కాంట్రాక్టర్ ను వెనుకేసుకు వచ్చే ప్రయత్నంలో జేఎస్ఎస్కె స్కీము ఆగిపోయిందని ఆ కారణంగా కొత్త మెనూ అమలు చేయలేకపోతున్నామని చెప్పారు. అయితే పాత మెనూ ప్రకారం అయినా జరుగుతుందా అని ప్రశ్నిస్తే అది కూడా జరగడం లేదని తేలిపోయింది. దీంతో ఇకమీదట అలా జరగకుండా చర్యలు తీసుకుంటామని డాక్టర్ రమాదేవి పేర్కొన్నారు. ???????????????????????????????????????????????????????????? స్వశక్తి సంఘం సభ్యురాలికి మెమో జారీ ... డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రీధర్ కాగా సుల్తాన్ బాద్ ప్రభుత్వాసుపత్రిలో రోగులకు మెనూ ప్రకారం ఆహారం అందించడం లేదని డి సి హెచ్ ఎస్ డాక్టర్ శ్రీధర్ ను వివరణ కోరగా ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెనూ ప్రకారం ఆహారం అందించని స్వశక్తి సంఘం సభ్యురాలికి వెంటనే మెమో జారీ చేయాలని కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ లేకుండా అనుభవం లేని వారికి ఆహారం అందించే పని ఎందుకు అప్పగించారని ప్రశ్నిస్తే, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అలా చేయాల్సి వచ్చిందని తెలిపారు.

.కాంట్రాక్టర్ దే ఇష్టా రాజ్యం.. .... రోగులకు అందని పౌష్టిక ఆహారం ... పట్టించుకోని ఆరోగ్య శాఖ అధికారులు .... అనుభవం లేని స్వశక్తి సంఘం సభ్యురాలికి కాంట్రాక్ట్


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :