D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ సెప్టెంబర్ 28 (అక్షరం న్యూస్) భారత ప్రజాస్వామ్యానికి శాపంగా మారిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం నాయకులు డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలో జరిగిన ధర్నా లో దీవెల కృష్ణయ్య ప్రసంగించారు. జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేసే వరకు ఆందోళన చేస్తామని ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని జైలుకు సహితం వెళ్తామని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దీవెల కృష్ణయ్య అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని వీటిని కాపాడుకునేందుకు పౌర సమాజం కదలాలనే వారు కోరారు. ఈ కార్యక్రమంతో వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బోళ్ళ గంగారావు, వైరా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వీరంశెట్టి సీతారాములు, వైరా ఏడవ వార్డు కౌన్సిలర్ పనితి సైదులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily