D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/తల్లాడ అక్టోబర్ 30( అక్షరం న్యూస్) తల్లాడ మండలం గాంధీనగర్ తండా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయబడిన అయ్యప్ప స్వామి పీఠమును ఎంతో భక్తిశ్రద్ధలతో గురువారం నాడు స్థల దాత అయినటువంటి రాయల నరసింహారావు (తిరుమలయ్య) గ కుమారుడు రాయల రాము చేతుల మీదుగా పీఠాన్ని ప్రారంభించారు. గురు శంకర్ గురుస్వామి ఆధ్వర్యంలో మణికంఠ శర్మ స్వామి పూజను ప్రారంభించి రాయల రాము చేతుల మీదగా ప్రారంభించడం అనంతరం;- రాయల రామస్వామి పూజ కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గాంధీనగర్ తండా స్వాములు లౌకిక మాత,రఘు స్వామి,కళ్యాణ స్వామి, నరేష్ స్వామి, సాయినాథ్ స్వామి,సాయికిరణ్ స్వామి, మురళి స్వామి, వరుణ్ స్వామి, సురేష్ స్వామి,ప్రమోద్ స్వామి,రమేష్ స్వామి రాములు స్వామి, శ్రీను చారి స్వామి, పవన్ స్వామి తదితర స్వాములతో పాటు గాంధీ నగర్ తండా గ్రామ ప్రజలు కూడా పాల్గొనడం జరిగింది పూజా కార్యక్రమంలో అయ్యప్ప స్వామి నామ స్మరణ తో పీఠం మొత్తం మారుమోగినది తదనంతరం స్వాములందరూ కలిసి రాయల రాము మరియు పూజారి అయినటువంటి మణికంఠ శర్మకు సన్మానం చేశారు.
.
Aksharam Telugu Daily