GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : * * కరీంనగర్/జమ్మికుంట/డిసెంబర్ 25/అక్షరం న్యూస్: రాజకీయ పార్టీ నాయకులు కొంతమంది విలేకరులు నాపై కావాలని రాజకీయంగా నన్ను ఇబ్బందులు గురిచేయాలనే ఉద్దేశంతో నాపై, మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం శివారులో గల అంజన టౌన్ షిప్ పైన తప్పుడు ఆరోపణలు రాతలు రాస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఏదైనా చట్టల ద్వారా వారికి సమాధానం చెప్తానని జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్నారు. గురువారం రోజున తన నివాసంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించి రాజేశ్వరావు మాట్లాడుతూ రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ము లేక కొంతమంది ఒక పత్రిక ఒక మీడియా ఛానల్ విలేకరులను ఆసరా తీసుకొని నాపై తప్పుడు రాతలు రాపిస్తున్నారని అన్నారు. అంజన టౌన్ షిప్ పైన తప్పుడు వీడియోలు తప్పుడు రాతలు విలేకరులకు లీగల్ నోటీసులు, జిల్లా కలెక్టర్ లకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గత మూడు సంవత్సరాల నుండి అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు గురిచేస్తూ అంజన టౌన్షిప్ పై ఎంతోమంది ఫిర్యాదులు చేశారని ప్రభుత్వాధికారులు వచ్చి ఎలాంటి ప్రభుత్వ భూమి అంజన్న టౌన్ షిప్ లో లేదని నిర్ధారించిన కానీ కొంతమంది అందులో ఇల్లు కట్టుకొని నివసిస్తున్న ప్రజలను నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. గత మూడు సంవత్సరాల క్రితం అంజన టౌన్ షిప్ లేఔట్ ప్రారంభించినప్పుడు అన్ని రకాలుగా ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్న తర్వాతనే అందులో క్రయవిక్రయాలను ప్రారంభించామని అప్పటినుండి ప్రభుత్వం ఏ విధంగా అయితే లేఅవుట్ పర్మిషన్ ఇవ్వడానికి ఎలాంటి అర్హతలు ఉండాలో అన్ని పత్రాలు సంబంధిత అధికారులకు సమర్పించిన తర్వాతనే ప్రారంభించామని రాజేశ్వర్ రావు తెలిపారు. ఒక మీడియా ఛానల్ ఒక పత్రిక రిపోర్టర్ ను అడ్వపెట్టుకొని నా పైన తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని రాజేశ్వరరావు హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily