AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / సిద్దిపేట జిల్లా : సిద్దిపేట జిల్లా / దుబ్బాక / సెప్టెంబర్ 16 / అక్షరం న్యూస్ -:కత్తి కార్తిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ సిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి ఉత్సవాలు మూడో రోజు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి. ఈ సందర్భంగా కత్తి కార్తిక గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమంలో భాగంగా కత్తి కార్తిక గౌడ్ స్వయంగా అన్నప్రసాదాలను పంపిణీ చేసి, భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాయంత్రం చిన్నారుల కోసం ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్న దాని పట్ల కత్తి కార్తిక గౌడ్ అక్క సంతోషం వ్యక్తం చేశారు.
.
Aksharam Telugu Daily