DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/ ఫిబ్రవరి 5 / అక్షరం న్యూస్:రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు ఈ ఘటన మండలంలోని చిన్నరాతుపల్లి కాల్వ శ్రీరాంపూర్ గ్రామాల మధ్య ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఓదెల మండలం పోత్కపల్లి గ్రామానికి చెందిన పచ్చిక ఫణిందర్ రెడ్డి.(28) పెదరాత్ పల్లి సోలార్ పవర్ ప్లాంట్ లో పనిచేసే స్వగ్రామం పోతుకుపల్లికి వెళ్తుండగా పెద్ద రాత్ పెళ్లికి చెందిన బొజ్జం సురేష్ (27) కాల్వ శ్రీరాంపూర్ నుండి పెద్ద రాతిపల్లి కి వెళ్తుండగా చిన్న రాతి పల్లి గ్రామ సమీపంలో ఎదురు ఎదురుగా రెండు వాహనాలు ఢీకొనడంతో బొజ్జం సురేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. పనిందర్ రెడ్డిని చికిత్స నిమిత్తం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. సంఘటన స్థలానికి కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై వెంకటేష్. ఏఎస్ఐ నీలిమ చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
.
Aksharam Telugu Daily