D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా సెప్టెంబర్ 28 (అక్షరం న్యూస్) వైరా క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సోమవారం నాడు కళాశాల విద్యార్థుల చేత, " నస్సాముక్తభారత్ ". మత్తు పదార్థాలు లేని భారతదేశ నిర్మాణం కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. అనంతరం విద్యా సంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని విలక్షణ మైన పద్ధతిలో మార్కెట్లో మత్తు పదార్థాలు మీ దృష్టికి వచ్చినప్పుడు కచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని, నీ బంధువులకు పరిచయస్తులకు మీరు నివసించే ప్రదేశాలలో మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్ధాలను వివరించాలని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా యువత భాగస్వామ్యంతో మాత్రమే మత్తు పదార్థాలు లేని భారతదేశ నిర్మించవచ్చని సూచించారు. విద్యా సంస్థల చైర్మన్ సంక్రాంతి సునీత మాట్లాడుతూ విద్యార్థులు అంకితభావంతో ఉత్తమ నైతిక విలువలను పాటించినప్పుడు కచ్చితంగా మత్తు పదార్థాలు లేని భారతదేశంలో నిర్మించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ఎన్ ఎస్ ఎస్ పి ఓ లింగారావు, ప్రిన్సిపల్ కృష్ణారావు, అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు. తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily