Saturday, 13 June 2026 04:44:01 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ధాన్యం బస్తాలతో రోడ్ ఎక్కిన రైతులు


P SUDHARSHAN, MANDAL REPORTER, ODELA, PEDDAPALLI.

Reporter

Date : 16 May 2026 02:05 PM Views : 229

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి/ఓదెల : ఓదెల/ పెద్దపల్లి మే 16 (అక్షరం న్యూస్) ఓదెల మండలంలోని కనగర్తి గ్రామంలో రోడ్ ఎక్కిన రైతన్న దాన్యం బస్తాలతో ప్రధాన రహదారిపై వేసి రోడ్డుకు అడ్డంగా కూర్చొని ధర్నా చేశారు ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కోతలు కోసి దాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించి దాదాపు నెల రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు దాన్యం తరలించడంలో ఎలాంటి పురోగతి లేదని సెంటర్ ఇన్చార్జిలను అడిగితే వివిధ కారణాల సాకుతో రైతులకు నిద్రలేకుండా చేస్తున్నారని ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులకు అనేకమైన ఇబ్బందులు ఏర్పడుతున్నాయని రైతుల బాధ ఎవరికి కనబడడం లేదని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఎన్ని సమస్యలు ఏర్పడుతున్నాయని. కోతలు మొదలైన ఇన్ని రోజులైనా ధాన్యం కొ నడం లేదని . కొనుగోలు ప్రక్రియ పాతదే కదా.. ఎందుకు ఇన్ని ఇబ్బందులని అసలు వడ్లు ప్రభుత్వం కొంటుందా.. మిల్లర్లు కొంటున్నారా? రైతులపై ఎందుకీ వివక్ష అంటూ మండిపడ్డారు ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చి చేస్తున్నదేమి లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మిల్లర్లకు ఇంటర్‌నేషనల్‌ నిబంధనలు ఏమైనా పెట్టారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. అసలు ప్రభుత్వం కొంటుం దా.. మిల్లర్లు ధాన్యం కొంటున్నారా! కొనుగోలు కేంద్రాల కాడికి అధికారులు వెంట పోలీసులను తీసుకొస్తారని, మా సమస్య చెప్పాలన్న కూడా ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆవేదన చెందారు. కాంగ్రెస్‌ హయాంలో ఇలా రైతులను ఎందుకు దిగజార్చుతున్నారని, ధాన్యం కొనుగోళ్లలో గతంలో ఎప్పుడు లేనంతంగా నష్టాలను రైతులకు కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పక్షాన ఎవరూ నిలబడటం లేదని, అధికారులు రావడం, ఏదో ఒకటి చెప్పి వెళ్లడం తప్పా ఏ ఏం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి తరలించాలని వర్షాకాలం సమీపిస్తున్న రైతుల్లో ఆందోళన మొదలైందని ఆరుగాలం కష్టపడి పండించడం పంట వర్షానికి ఏమైపోతుందో అన్న భయంతో కొంతమంది అయోమయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళ రైతులు రైతులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :