Monday, 15 December 2025 08:13:20 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

సీజనల్ వ్యాధుల పట్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలి, వార్డెన్లు విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 29 August 2025 06:41 PM Views : 329

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : *భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు, అక్షరం న్యూస్ /ఆగస్టు 29: వాతావరణం మార్పు వలన గ్రామాలలో వైరల్ ఫీవర్ విజృంభిస్తున్నందున హెచ్ఎం, ఉపాధ్యాయులు మరియు వార్డెన్ సమన్వయంతో ఉండి ఆశ్రమ పాఠశాలలో చదివే పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం నాడు బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాలను మరియు వడ్డుగూడెంలోని జిపిఎస్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉప్పుసాకా ఆశ్రమ పాఠశాలను సందర్శించి డార్మెటరీ, డైనింగ్ హాల్, వంటగది, సిక్ రూమ్ పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన విద్యార్థినీ విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పనిచేస్తున్న హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది ఎటువంటి విభేదాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా ఉండి విద్యార్థిని విద్యార్థుల ఆరోగ్యంతో పాటు వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. ప్రతిరోజు మెనూ ప్రకారం ఆహార అందించాలని, స్టోర్ రూమ్ లో నాసిరకమైన ఆహార పదార్థాలు డేట్ అయిపోయినవి ఉంటే వెంటనే తీసివేయాలని, జిసిసి నుంచి సరఫరా అయ్యే ప్రతి వస్తువు నాణ్యతగా ఉన్నవి తీసుకోవాలని అన్నారు. అనంతరం సిక్ రూములో వైద్య సేవలు తీసుకుంటున్న విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకొని, పిల్లలు అనారోగ్య బారిన పడినప్పుడు మెడికల్ క్యాంపులు నిర్వహించారా లేదా అని హెచ్ ఎం ని అడిగి తెలుసుకుని, పిల్లలకు రెండు మూడు రోజులు మించి జ్వరంగా ఉంటే వెంటనే దగ్గరలో ఉన్న పీహెచ్సీకి తీసుకొని పోయి వైద్య పరీక్షలు చేయించి పిల్లల తల్లిదండ్రులకు మరియు డిడి ట్రైబల్ వెల్ఫేర్ ,ఏ టి డి ఓ దృష్టికి విషయం తెలియజేయాలని అన్నారు. అనంతరం సిక్ రూమ్ లోని మందులను పరిశీలించి ఓ ఆర్ ఎస్ పాకెట్టు ఎక్స్పైరీ డేట్ ఈనెలాఖరు వరకే ఉందని కొత్త స్టాకు తీసుకోలేదా అని ఏఎన్ఎంని అడిగి తెలుసుకుని డేట్ అయిపోయిన మందులు ఉంటే వెంటనే తీయించి వేయాలని అన్నారు. అనంతరం డిఎంహెచ్వో కు ఫోన్ కాల్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ ఉప్పుసాక పాఠశాలలో నిర్వహించిన మెడికల్ క్యాంపుల వివరాలు, పిల్లల యొక్క ఆరోగ్య స్థితిగతులకు సంబంధించిన డాటా తనకు అందజేయాలని, సరిపడా మందులు ఈ పాఠశాలకు సరఫరా చేసి మెడికల్ క్యాంపులు మరలా నిర్వహించాలని ఆదేశించారు. వంట చేసే సిబ్బంది పరిశుభ్రతను పాటించి వంటగదిని వంట సామాగ్రిని ఎప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని, పాఠశాల ఆరుబయట రాత్రిపూట పిల్లలు ఎవరు? రాకుండా చూడాలని, వర్షాకాలంలో విషపూరితమైన క్రిమి కీటకాలు పాములు తేళ్లు సంచరించే అవకాశం ఉన్నందున ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్ఎం కు ఆదేశించారు. అనంతరం ప్రైమరీ పాఠశాలలోని ఉద్దీపకం వర్క్ బుక్ -2 నిర్వహణ తీరును పరిశీలించారు. ఉద్దీపకం వర్క్ బుక్ సంబంధించిన ప్రతి అంశం విద్యార్థులకు తెలియజేసే విధంగా బోర్డుపై వ్రాయించాలని అన్నారు. చదువులో వెనుకబడ్డ పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అనంతరం ఒక్కొక్క విద్యార్థినీ లేపి ఉద్దీపకం నకు సంబంధించిన పదాలను బోర్డుపై వ్రాయించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల మరమ్మత్తుల కొరకు నిధులు విడుదలయ్యాయనీ విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వాష్ రూమ్, టాప్స్, టాయిలెట్స్ ఏమైనా మరమ్మతులు ఉంటే వెంటనే చేయించాలని హెచ్ఎంకు సూచించారు. అనంతరం వడ్డేగూడెం జిపిఎస్ పాఠశాలను సందర్శించి ఉద్దీపకం వర్క్ బుక్ -2 చిన్నారులకు ఏ విధంగా బోధిస్తున్నది పరిశీలించి చిన్నారులను ఉద్దీపకములోని అంశాలు ఏ విధంగా చదువుతున్నది చూసి పిల్లలు ఉద్దీపకం లోని అంశాలు పదాలు చదవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఉద్దీపకంలోని ప్రతి అంశం పదాలు ఉపాధ్యాయులు ముందుగా చదువుకొని ఆ తర్వాత పిల్లలకు అర్థమయ్యే రీతిలో బోధించాలని ఉద్దీపకం వర్క్ బుక్ పిల్లలకు బోధన విషయంలో నిర్లక్ష్య వైఖరి కనబరిస్తే సంబంధిత ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతున్నదని, ఎస్ సి ఆర్ పి ప్రతిరోజు మీ పరిధిలోని పాఠశాలలను తప్పనిసరిగా పర్యవేక్షణ చేసి ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ పిల్లలకు ఏ విధంగా బోధిస్తున్నది పరిశీలించి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ తనకు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప్పుసాక పాఠశాల హెచ్ఎం భీమ, వార్డెన్ శశికళ, ఎస్ సి ఆర్ పి మాధవి, వడ్డుగూడెం జిపిఎస్ పాఠశాల ఉపాధ్యాయుడు బాలు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :