AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 8/ అక్షరం న్యూస్/---మండల కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మండల స్థాయి బోధనోపకరణాల మేళా సోమవారం నిర్వహించారు.ఈ మేళా కు మండలంలోని కుదునూరు చిన్న మిడిసిలేరు తేగడ గర్ల్స్ హైస్కూల్ గవర్నమెంట్ హైస్కూల్ కాంప్లెక్స్ ల పరిధిలోని అన్ని పాఠశాలల నుంచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయినులు హాజరై తాము తయారు చేసిన బోధనోపకరణాలు ప్రదర్శించారు.అన్నింటిలో ఉత్తమంగా ఉన్న భోధనోపకరణాలకు ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖాధికారి పి వి రమణ మాట్లాడుతూ విద్యార్ధులకు పాఠ్యాంశాలు సులభంగా అర్ధమయ్యేందుకు భోధనోపకరణాలు చాలా ఉపయోగపడతాయన్నారు. సమాజంలో అత్యంత గౌరవప్రదమైనది అందరి మన్ననలు పొందేది ఉపాధ్యాయ ఉద్యోగమేనని అన్నారు.పిల్లల బంగారు భవిష్యత్తు బడుల్లోనే రూపుదిద్దుకుంటుందని తెలిపారు.ప్రస్తుతం మండలంలో ఎక్కువ మంది కొత్త ఉపాధ్యాయులే ఉన్నారని వారందరూ ఎంతో ఉత్సాహంగా తమ తమ విధులను నిర్వర్తిస్తున్నారని కొత్తగా వచ్చిన టీచర్లకు కితాబిచ్చారు.ఈ సందర్భంగా మండలంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన పదహారు మంది నీ ఘనంగా సత్కరించారు.
.
Aksharam Telugu Daily