Sunday, 29 March 2026 03:26:53 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

పూనుగొండ్ల నుంచి మేడారంకు బయలుదేరిన పగిడిద్దరాజు....


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 27 January 2026 07:58 PM Views : 373

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ జనవరి 27(అక్షరం న్యూస్) ఆసియా ఖండంలోనే నిర్వహించే అతిపెద్ద గిరిజన జాతరఐన సమ్మక్క–సారక్క మహాజాతర రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో సమ్మక్క భర్త పగిడిద్దరాజును మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం లోని పూనుగొండ్ల నుంచి పెళ్లి ఘట్టం నిమిత్తం మేడారంకు ఇవాళ అత్యంత భక్తిశ్రద్ధలతో, పెనుక వంశీయుల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయాల ప్రకారం పడిగే రూపంలో బయలుదేరారు పూనుగొండ్ల నుంచి బయలుదేరిన పూజారుల బృందం,నేడు రాత్రి పస్ర సమీపంలోని లక్ష్మీపురం గ్రామంలో బస చేసి, రేపు ఉదయం పడిగవాగు వద్ద జంపన్నవాగులో స్నానలు చేసి, అనంతరం సాయంత్రం 06:30 వరకు మేడారంలోని పగిడిద్దరాజు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. ఈ సంప్రదాయ కార్యక్రమాన్ని పెనుక వంశీయులు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నారు ఈ ప్రధాన ఘట్టం సజావుగా సాగేందుకు ప్రభుత్వం ముందస్తు అంచనాలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నారు పగిడిద్దరాజు మేడారంకు బయలుదేరిన సందర్భంలో మంత్రి సీతక్క పూనుగొండ్లకు చేరుకొని, గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తూ పూజారులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి, పగిడిద్దరాజును మేడారంకు ఘనంగా సాగనంపారుగిరిజన ఆచారాలకు, వారి విశ్వాసాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందనే విషయాన్ని మరోసారి మంత్రి సీతక్క ఈ సందర్భంగా స్పష్టం చేశారు గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, సమ్మక్క–సారక్క జాతరను విజయవంతం చేయడంలో పూజారుల పాత్ర అమూల్యమని ఆమె పేర్కొన్నారు*....

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :