GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్,(పెద్దపల్లి జిల్లా) అక్టోబర్ 12.అక్షరం న్యూస్. చదువుతోపాటు అన్ని రంగాల్లో ఆల్ఫోర్స్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరుస్తూ ముందుకు పోతున్నారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. పాఠశాలల క్రీడోత్సవాల్లో భాగంగా ఎలిగేడు మండల కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి చదరంగం పోటీల్లో నలుగురు విద్యార్థులు తమ సత్తా చాటి ఉమ్మడి జిల్లా పోటీలకు ఎంపికైనట్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులను ఆదివారం నరేందర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిష్ణాతులైన అధ్యాపకులచే నిత్య శిక్షణ ఇవ్వడంతో విద్యార్థులు రాటు దేలుతున్నారని వారిని మరింత ప్రోత్సహించి నట్లయితే రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణిస్తారని తెలిపారు. ఎంపికైన వారిలో అండర్ 14 బాలికల విభాగంలో శ్రీ వర్షిని యాదవ్, బాలుర విభాగంలో ఎం వాసుదేవ్, అండర్ 17 బాలుర విభాగంలో పి అనిరుద్, బాలికలు విభాగం లో అనన్యలు ఉన్నారు . వీరిని ప్రిన్సిపాల్ తో పాటు అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు.
.
Aksharam Telugu Daily