GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : . రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-10(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామ శివారులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి త్రవ్వి తరలిస్తున్నరన్న సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. మట్టి తరలిస్తున్న 05 ట్రాక్టర్లు, ఒక జేసిబి ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు నిమిత్తం ట్రాక్టర్లు, జేసిబి వాటి డ్రైవర్లను ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించ్చినట్లు తెలిపారు ఈసందర్భంగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ నటేష్ మాట్లాడుతూ...నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మట్టి త్రవ్వకలు జరిగిన, రవాణా చేసిన కేసులు తప్పవని,జిల్లాలో ఎక్కడైనా మట్టిని తవ్వడం, నిల్వ చేయడం, రవాణా చేయాలంటే ముందస్తుగా సంబంధించిన శాఖ నుండి అనుమతి పొందాలని,లేకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.జిల్లా పరిధిలో ఎక్కడైనా అక్రమంగా మట్టిని తరలించినా,తవ్వకాలు చేసినా,నిల్వ చేసినా సమాచారం అందించాలని కోరారు
.
Aksharam Telugu Daily