Saturday, 04 April 2026 01:42:11 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మండల వ్యాప్తంగా గ్రామపంచాయతీలలో గ్రామసభలు.

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 03 April 2026 11:54 AM Views : 586

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/శంకరపట్నం : శంకరపట్నం/కరీంనగర్/ఏప్రిల్ 2/ అక్షరం న్యూస్: సమస్యల పరిష్కారానికే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ రాష్ట్ర‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన‌-ప్రగతి ప్రణాళిక పంచాయతీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరము కోసం.గురువారం శంకరపట్నం మండల వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ పథకాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించారు.గ్రామ సభల ఆరంభంలో రాష్ట్ర గీతం ఆలపించి సభలను ప్రారంభించి సీఎం సందేశాన్ని చదివి వినిపించారు.అనంతరం అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,ఉచిత ఆర్టీసీ ప్రయాణం,రూ.500కే గ్యాస్ సిలిండర్,గృహజ్యోతి,పెంచిన పింఛన్ల పథకాలపై గ్రామస్తులకు సమగ్రంగా అవగాహన కల్పించారు.గ్రామాల్లో సమస్యలు ఉంటే సభలో తమ దృష్టికి తీసుకురావాలని,లబ్ధిదారులకు పింఛన్లు,ఇతరత్రా సమస్యలుంటే దరఖాస్తు చేసుకుంటే 99 రోజుల ప్రణాళికలో భాగంగా వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.గ్రామ పంచాయతీల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు సక్రమంగా అందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందని,గ్రామాల్లో ఏ సమస్య ఉన్నా గ్రామాభివృద్ధిలో భాగంగా ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ప్రత్యేక అధికారులు, సర్పంచులు,ఉప సర్పంచులు,వార్డుమెంబర్లు,కార్యదర్శులు,గ్రామస్తులు,వివిధ శాఖ ల అధికారులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :