D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 13 తల్లాడ (అక్షరం న్యూస్) సత్తుపల్లి పట్టణంలో రాణి సెలబ్రేషన్ ఫంక్షన్ హాల్ నందు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల అభినందన సభ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లాడ మండలం మల్లవరం గ్రామ సర్పంచ్ కటికి కిరణ్ కుమార్ ని రాష్ట్ర రెవిన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయకుమార్ కిరణ్ కుమార్ ని సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా సుధాకర్ గారు, గుర్రం శ్రీను, భూక్య అంజయ్య, తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జమాల్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily