GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జూన్ -18(అక్షరం న్యూస్ ) తాటి చెట్టు పైనుండి జారిపడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన ముస్తాబాద్ మండలంలోని చీకోడ్ గ్రామంలో శుక్రవారం జరిగింది. . గౌడ కార్మికులు తెలిపిన సమాచారం ప్రకారం.. చీకోడ్ గ్రామానికి చెందిన గున్నాల కిష్టా గౌడ్ ప్రతిరోజు తాటి చెట్లు ఎక్కి కల్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం సాయంత్రం చెట్లు గీయడానికి వెళ్లిన కిష్టా గౌడ్ అకస్మాత్తుగా తాటి చెట్టు పైనుండి ఒక్కసారిగా కిందపడ్డాడు.తీవ్ర గాయాలు కావడం తో ఆందోళన చెందిన తోటి గీత కార్మికులు వెంటనే చికిత్స కోసం ముస్తాబాద్ లోని ఒక ప్రయివేట్ ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారుకిష్టా గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని గీత కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని కోరారు.
.
Aksharam Telugu Daily