Monday, 15 December 2025 06:51:21 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్టిపిసి రామగుండం గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో విజయ బేరి మోగించిన బి ఎం ఎస్... 40 ఏళ్ల తర్వాత రెండవసారి గెలిచిన బిఎంఎస్... పోరా పోరి పోటీలో 5 ఓట్ల త

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 25 September 2025 07:52 PM Views : 701

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతి నగర్ ఎన్టిపిసి సెప్టెంబర్ 25 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ రామగుండం ఎన్టిపిసి ఉద్యోగుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బిఎంఎస్ ఘన విజయం సాధించింది. గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం మూడున్నర వరకు జరిగిన ఎన్నికల్లో 212 ఓట్లకు గాను 208 ఓట్లు పోలయ్యాయి. బి ఎం ఎస్ 102 ఓట్లు సాధించగా ఐఎన్టియుసికి 94 ఓట్లు వచ్చాయి. కేవలం ఎనిమిది ఓట్ల మెజారిటీతో బి. ఎం. ఎస్ గట్టెక్కింది. ఐదు ఓట్లు మారితే ఫలితం మరోలా ఉండేది. ఎన్నికల్లో పోటీ చేసిన సిఐటియుకు 12 ఓట్లు వచ్చాయి. గతంలో కూడా ఐ ఎన్ టి యు సి 10 ఓట్ల తేడాతో ఓడిపోయింది. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన ఐ ఎన్ టి యు సి ఈసారి చతికిలబడింది. చాప కింద నీరులా బి ఎం ఎస్ అనూహ్య విజయం సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ఎన్టిపిసి రామగుండంలో మొట్టమొదటిసారి 40 ఏళ్ల క్రితం జరిగిన వెరిఫికేషన్ ఎన్నికల్లో కూడా బిఎంఎస్ విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ గెలుపు వరించలేదు. ఐ ఎన్ టి యు సి లో బలమైన నాయకుడు బాబర్ సలీం పాషా ఆధ్వర్యంలో 75% పైగా ఓట్లు సాధిస్తుందని అందరు భావించారు. కానీ ఉద్యోగులు వారి విభిన్నమైన శైలిని కనబరిచారు. ఇప్పటివరకు వరుసగా మూడోసారి ఏ యూనియన్ గెలవలేదు. అదే సాంప్రదాయం పునరావృత్తమైంది. ఉదయం నుంచి కురిసే వర్షంలో మూడు యూనిట్ల నాయకులు మెయిన్ గేటు వద్ద టెంట్లు వేసుకుని ప్రచారం నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఫలితాల అనంతరం బి ఎం ఎస్ నాయకులు భాస్కర్ రెడ్డి సాగర్ రాజు రంజిత్ మహేష్ మాట్లాడుతూ ఇది ఉద్యోగుల విజయం అని అన్నారు. కార్మికులు ఇచ్చిన తీర్పును గౌరవించే వారికి అనుకూలంగా పనిచేస్తామని అన్నారు. కార్మికులు ఎవరికి భయపడకుండా చక్కగా ఓటు వేసి తన అభిప్రాయాలను వ్యక్తం చేశారని వారు కొనియాడారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు కందుల సంధ్యారాణి సోమారపు లావణ్య అరుణ్ కుమార్ సింగరేణి బిఎంఎస్ నాయకులు యాదగిరి సత్తయ్య కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు బండారి కనుకయ్య బి ఎం ఎస్ నాయకులు సత్యనారాయణ రెడ్డి పోగుల స్వామి గాండ్ల కొమురయ్య రాములు మేకల రామస్వామి కాంట్రాక్ట్ కార్మిక సంఘ నాయకులు శ్రీనివాస్ పురుషోత్తం రాజు సాదుల రాంబాబు తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :