AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 9/ అక్షరం న్యూస్/-----ఉంజుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న మిషన్ భగీరథ ఓవర్ హెడ్ (సంపులో) నీటిని తోడేందుకు మోటర్ అమర్చేందుకు నలుగురు కార్మికులు సంపులో దిగిన్నారు.అందులో ఇద్దరు కార్మికులు మృతిచెందగా మరో ఇద్దర పరిస్థితి విషమంగా ఉంది. వారికి సిహెచ్సి వైద్యులు ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం భద్రాచలం రిఫర్ చేశారు.మృతులు లింగాపురం పాడు గ్రామానికి చెందిన నీలం తులసి రాం (38) ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉంజుపల్లి గ్రామానికి చెందిన కాక మహేష్ (36) ఇతనికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.సంపులో పడిన వ్యక్తులను రక్షించడానికి వెళ్లి ఇతడు మృత్యువాత పడ్డాడు. అనసూరి అప్పల రాజు (55) కాకినాడ గ్రామానికి చెందినవాడు. తాడిగడప ఇసాక్ (50) ఇతను తనుకు గ్రామానికి చెందినవాడు. వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం సంభవించిందని మృతుల బంధువులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
.
Aksharam Telugu Daily