GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/జులై-26(అక్షరం న్యూస్) గంజాయికి బానిసై సు లాభ మార్గంలో డబ్బులు సంపాదించాలనే ఉద్దేశ్యంతో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి ని ముస్తాబాద్ పోలీసులు అ రెస్టు చేశారు.స్థానిక ఎస్ ఐ గణేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన మందాట చందు (22)తన స్నేహితుడు ఐనా మనోజ్ దగ్గర గంజాయి కొనుగోలు చేసాడు.దానిలో కొంత త్రాగి మిగిలిన గంజాయి ని ముస్తాబాద్ శివారులో అమ్మడానికి వస్తున్న క్రమంలో అతని ని పట్టుకొని అతని వద్ద నుండి102గ్రాముల గంజాయి,ఒక.మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్టు ఎస్సై గణేష్ తెలిపారు అతని స్నేహితుడు పరార్ లో ఉన్నట్టు తెలిపారు నిషేధిత గంజాను కలిగి ఉన్న విక్రయించిన కఠిన చర్యలు తప్పవని ఎస్ ఐ హెచ్చరించారు
.
Aksharam Telugu Daily