Monday, 20 April 2026 07:12:50 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఆగని సన్న బియ్యం దందా.*.! *చిన్న బండితో పెద్ద వ్యాపారం..*! *పట్టించుకోని అధికారులు..!*

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 11 June 2025 06:22 PM Views : 1170

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం : * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జూన్ 11/ వైరా (అక్షరంన్యూస్)* వైరా మండలంలో రేషన్ బియ్యం అక్రమ దందా జోరుగా సాగుతోంది. మండలంలోని పలు గ్రామాలు వైరా,పినపాక, గరికపాడు,నారుపునేనిపల్లి, రెబ్బవరం,తాటిపూడి, సోమవారం తదితర గ్రామాల నుండి రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు.ఈ పీడీఎస్ బియ్యాన్ని అక్రమ దారులు గుర్తుచప్పుడు కాకుండా రహస్య స్థావరాలకు తరలిస్తూ కొందరు అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. *కొత్తదారి ఎంచుకున్న అక్రమార్కులు....!* సన్న బియ్యాన్ని డీలర్ల వద్ద నుంచే అక్రమార్కులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. అక్రమార్కులు బియ్యం తరలింపులో నయా విధానం అవలంభిస్తున్నారు.గతంలో ఆటోలు, టాటా ఏసీ వాహనాలలో రేషన్ బియ్యాన్ని ఒకేసారి తరలించేవారు.ఈ క్రమంలో పెద్ద మొత్తంలో బియ్యం పట్టుబడితే పట్టుబడిన మొత్తం బియ్యం బస్తాల్ని సీజ్ చేసేవారు.ఇలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావించిన అక్రమార్కులు రవాణాకు ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తున్నారు.ఎవరికీ అనుమానం రాకుండా ద్విచక్ర వాహనాలపై రెండు, మూడు బస్తాలు తరలిస్తున్నారు. మార్గమధ్యలో ఎవరైనా అడిగితే ఇవి మా సొంత బియ్యం అని బుకాయిస్తున్నారు.తక్కువ కిలోల చొప్పున బస్తాల్లో తరలిస్తూ కొద్దికొద్దిగా రేషన్ బియ్యాన్ని రహస్య స్థావరాలకు చేరవేస్తున్నారు *పగలు లేదు రాత్రి లేదు...!* పగలు పూట సేకరించిన బియ్యాన్ని అక్రమంగా రాసేస్తావరాల్లో నిల్వ ఉంచి. వేకువ జామున 3 గంటల నుండి వారు పెద్ద ఎత్తున వాహనాల్లో తరలిస్తున్నారు.రేషన్‌ బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాల్సిన అధికారులు నామమాత్రంగా అయినా తనిఖీలు కూడా చేయటం లేదు.దీంతో అక్రమార్కుల దందా రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :