AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్ : హైదరాబాద్/ జనవరి 02 అక్షరం న్యూస్ - : బిఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో దోషిగా నిలబెడతామని నీళ్ల పేరిట రాష్ట్రాన్ని దోచుకొని, కమిషన్ల కు కకృతి పడి ఆంధ్ర నాయకులకు అమ్ముడుపోయిన పార్టీ బిఆర్ఎస్ అని వరంగల్ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ ఆయుబ్ అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాదులో ప్రజాభవన్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలకమైన అంశం పై జరిగిన ‘నీళ్లు- నిజాలు’ అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణ-గోదావరి నదీజలాల నీటి కేటాయింపులు, బీఆర్ఎస్ ఆరోపణలపై చర్చ జరిగింది. డీప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లుతో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మహమ్మద్ అయూబ్ మాట్లాడుతు 2014 నుంచి నేటి వరకు కృష్ణా- గోదావరి నదిలో నీటి కేటాయింపులు, బీఆర్ఎఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందాలపై సీఎం అవగాహన కల్పించారని, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, రెండేళ్ల ప్రభుత్వ పనితీరుని అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రిని మరియు పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ని కలిసి జిల్లా పరిస్తుతులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గతంలో పరిపాలించిన టిఆర్ఎస్ పార్టీ నీళ్ల పేరిట రాష్ట్రాన్ని దోచుకుని కమిషన్ల కు కక్కుర్తి పడి ఆంధ్ర నాయకులకు సాగినంగా పొర్లి దండాలు పెట్టి దోచి పెట్టారని అన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై తెలంగాణకు రావలసిన కృష్ణ గోదావరి జలాల వాటాపై మౌనం వహిస్తూ. ఆంధ్ర రాష్ట్రానికి లాభం చేకూర్చే విధంగా బిఆర్ఎస్ పార్టీ చేసిందని తెలంగాణ కు చేసిన ద్రోహాన్ని తెలంగాణ ప్రజానీకానికి అర్థమయ్యే విధంగా తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి నేతృత్వంలో ప్రజాభవన్లో గత పాలకులు చేసిన అన్యాయాలపై ప్రజలకు జరిగిన నష్టంపై ప్రజలకు అర్థమయ్యే విధంగా పవర్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా ఎమ్మెల్యేలకు మంత్రులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు మరియు ముఖ్యంగా నీటిపారుదల శాఖ అధికారులు అందరికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అన్ని విషయాలను వివరంగా వివరించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రాష్ట్ర రథసారథి మహేష్ కుమార్ గౌడ్ కి మరియు మంత్రులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి గత పాలకులు కేసీఆర్, హరీష్ రావు చేసిన తెలంగాణ వ్యతిరేక విధానాలను ద్రోహంను గ్రామ గ్రామానికి చేరే విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకుని మంత్రులు మరియు శాసనసభ్యుల మండల ఇతర ముఖ్య నాయకుల సహకారంతో టిఆర్ఎస్ పార్టీని దోషిగా ప్రజల ముందు ఉంచుతామని తెలియజేశారు.
.
Aksharam Telugu Daily