AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/బూర్గంపాడు మండలం/మొరంపల్లి బంజర. అక్షరం న్యూస్ /జులై 19: బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో స్టెల్లా మెరిస్ పాఠశాలను బూర్గంపాడు మండల విద్యా అధికారి సందర్శించి విద్యార్థులను ఆయా తరగతుల లీడర్లుగా నియమించారు. స్టెల్లా మెరిస్ పాఠశాల చక్కని వాతావరణంలో విశాలమైన స్థలములో ఉందని విద్యార్థులు మంచి క్రమశిక్షణ కలిగి ఉన్నారని ప్రిన్సిపాల్ సిస్టర్ సుమలతను కొనియాడారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ చదువు మనిషి జీవితాన్ని మారుస్తుంది, జ్ఞానాన్ని అందిస్తుంది, ఆర్థిక అభివృద్ధి చెందటానికి సహాయపడుతుంది మరియు సమాజంలో గౌరవం సంపాదించడానికి తోడ్పడుతుంది చదువుకోవడం ద్వారా మనం కొత్త విషయాలను తెలుసుకుంటాం ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాం మరియు సమస్యలను పరిష్కరించడానికి అవసరమైన నైపుణ్యాలను పొందుటయేగాక చదువుకున్న వ్యక్తులు మంచి ఉద్యోగాలు సంపాదించడానికి మరియు ఆర్థికంగా స్వతంత్రులు కావడానికి దోహదపడుతుందని వారు మాట్లాడటం జరిగింది . ప్రతి విద్యార్థి క్రమశిక్షణ కలిగి ఉండాలని క్రమశిక్షణ ద్వారా చదువు, వినయం, గౌరవం, మంచి స్థాయిని పొందుతారని వారు తెలియజేశారు, చదువుకోవడం ద్వారా వివిధ సంస్కృతులు సంప్రదాయాలు మరియు చరిత్ర గురించి తెలుసుకోవచ్చు ఇది మరింత సమగ్రమైన అవగాహనకు దారితీస్తుందని వారు తెలియజేశారు. చదువు సమాజంలో గౌరవాన్ని మంచి పేరును గుర్తింపును తీసుకొస్తుందని ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని దేశం అభివృద్ధి చెందడానికి చదువుకున్న పౌరులెంతో అవసరమని చదువుకున్న ప్రజలు దేశానికి ఆర్థికంగా సామాజికంగా ఎంతో ఉపయోగపడుతారని చదువు ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనదని వారు తెలియజేశారు. ఈ సందర్భంగా తమ పాఠశాలను సందర్శించి విద్యార్థులను లీడర్లుగా నియమించి వారికి సలహాలు సూచనలు అందించినందుకు మా యొక్క యజమాన్యాం మరియు అధ్యాపకుల తరపున మండల అధికారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారు మా పాఠశాలకు రావటం ఎంతో ఆనందాన్ని కలగజేసిందని వారు పలికిన ప్రతి మాటలో సత్యం ఉందని కొన్ని కొత్త విషయాలను మేము తెలుసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ సిస్టర్ సుమలత గారు తెలియజేశారు.
.
Aksharam Telugu Daily