Sunday, 08 November 2026 09:27:26 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఎన్టీపీసీలో ఘనంగా 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఉత్సాహంగా, దేశభక్తి భావంతో నిర్వహణ.. మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 08 November 2026 02:35 PM Views : 41

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపెల్లి/ గోదావరిఖని (జ్యోతి నగర్ ): : జ్యోతినగర్, ఎన్టీపీసీ నవంబర్ 7 పెద్దపల్లి జిల్లా అక్షరం న్యూస్ : ఎన్టీపీసీ 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం ఎన్టీపీసీ రామగుండం, తెలంగాణ ప్రాజెక్టుల సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సాహంగా, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఆవరణలో పలు కార్యక్రమాలు చేపట్టారు. వేడుకల్లో భాగంగా తొలుత పీటీఎస్‌లోని ప్రధాన షాపింగ్ సెంటర్ నుంచి సీ-11 క్వార్టర్స్ వరకు ప్రభాత్‌ఫేరీ నిర్వహించారు. అనంతరం సీ-11 క్వార్టర్స్ మైదానంలో సామూహిక మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడంపై సంస్థకు ఉన్న నిబద్ధతను ఈ కార్యక్రమం చాటిచెప్పింది. అనంతరం పరిపాలనా భవనంలో నిర్వహించిన ప్రధాన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీపీసీ ఈడీ (ఆర్ అండ్ టీ) ఫైజ్ తయ్యబ్‌కు ఘన స్వాగతం పలికారు. ఆయన ఎన్టీపీసీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మానవ వనరుల విభాగాధిపతి సాగర్ రంజాన్ సాహు స్వాగతోపన్యాసం చేశారు. వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి, రంగురంగుల బెలూన్లను గాలిలోకి వదిలారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని ఎన్టీపీసీ కార్పొరేట్ కేంద్రం నుంచి సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గురు దీప్ సింగ్ చేసిన ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఉద్యోగులు వీక్షించారు. 52 ఏళ్ల ప్రస్థానంలో సంస్థ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూ, దేశ ప్రగతికి విద్యుత్ రంగంలో మరింత సమర్థవంతమైన సేవలు అందించాలనే సంకల్పాన్ని ఈ వేడుకలు ప్రతిబింబించాయి. ఉద్యోగుల సమష్టి కృషి, అంకితభావం, నిబద్ధతతో సంస్థను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనే సందేశాన్ని వేడుకలు చాటిచెప�

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :