AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 5/అక్షరం న్యూస్/----- పండితుడు గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి నీ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదు న ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటిస్తుంది.ఉపాధ్యాయ వృత్తి సామాజికంగా ఎంత ఉన్నతమైనదో తెలియజేస్తూ విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన చిట్టి బోతుల వేణుగోపాల్ ( ఎల్ ఎఫ్ ఎల్ ఎం పి పి ఎస్ పూజారి గూడెం) ను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడు గా ప్రకటించింది. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్న చిట్టిబోతుల వేణుగోపాల్ ను పలువురు అభినందించారు.
.
Aksharam Telugu Daily