D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * **.. ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ వైరా/అక్టోబర్/ 28( అక్షరంన్యూస్) సత్తుపల్లి మండలంలోని అడసర్లపాడు గ్రామంలో సత్తుపల్లి లైన్స్ క్లబ్, లయన్స్ ఐ హాస్పిటల్, వైరా ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిభిరం విజయవంతంగా నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిభిరంలో సుమారు 250మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50మందికి కంటి అపరషన్స్ గుర్తించారు. ఈ సందర్బంగా డిస్ట్రిక్ట్ సర్వీస్ కోఆర్డినేటర్ గండ్ర సోమిరెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజలకు లయన్స్ కంటి ఆసుపత్రి చేస్తున్న సేవలను అభినందించారు. లయన్ డాక్టర్ కాపా మురళీకృష్ణ ఐ హాస్పిటల్ చైర్మన్, ఐ హాస్పిటల్ నిర్వాహకులు లయన్ శ్యాంబాబు ఉండ్రు, డాక్టర్ రవిచంద్ర, కంటి ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ సర్వీస్ కోఆర్డినేటర్ గండ్ర సోమిరెడ్డి, క్యాంప్ చైర్మన్ కాసర చంద్రశేఖర్ రెడ్డి, క్యాంపు చైర్మన్ లయన్ పెనుగొండ రమేష్, సత్తుపల్లి లైన్స్ క్లబ్ అధ్యక్షులు గోగడ రవి, సెక్రెటరీ ఎన్.వి.రమణ, ట్రెజరర్ చల్లగుండ్ల అప్పారావు, లయన్స్ క్లబ్ సభ్యులు కంటి వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily