D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ... ఖమ్మం /స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ నవంబర్ 10 (అక్షరంన్యూస్) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఐకెపి ద్వారా ఏర్పాటు చేసిన కేంద్రాలలో నియమ నిబంధనలు నాణ్యత ప్రమాణాల ప్రకారం వరి ధాన్యం కొనుగోలు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి సత్సంబంధాల తో కేంద్రాలను నడపాలని స్థానిక తాసిల్దార్ కరుణాకర్ రెడ్డి ఐకెపి మహిళల కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో అన్నారు. సోమవారం ఐకెపి కార్యాలయంలో జరిగిన ముందస్తు ప్రణాళిక సమావేశంలో వారు మాట్లాడుతూ ముఖ్యంగా ఐకెపి కొనుగోలు కేంద్రాల వారు సెంటర్ నిర్వహణలో భాగంగా బస్తాలను నేరుగా రైతులకు ఇవ్వకుండా ఏఈఓ తో తేమ శాతం పరిశీలించిన తర్వాత అంచనా బ్యాగులు నిర్ధారించిన తర్వాత మాత్రమే ఆ రైతుకు తూకాలు వేసి హమాలీలకు అందజేయాలని తెలియజేశారు అలా కాకుండా ముందస్తుగా రైతులకు బస్తాలను జారీ చేయడం ద్వారా కొంతమంది రైతులు తేమ రాకుండా గన్ని బ్యాగులు నింపుకుంటారని తద్వారా కాటాలు ఇబ్బంది పడవలసి వస్తుందని అన్నారు. ఏఈ ఓ కూడా వారి గ్రామాలలో నిత్యం అందుబాటులో ఉండి రైతులకు తేమశాతం సరిగా చూసి కొనుగోలు కేంద్రాల వద్దకు పంపే విధంగా చేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు కూడా ధాన్యం నాణ్యత ప్రమాణాలలో లేకుండా టోకెన్ జారీ చేయవద్దని విశ్లేషణ పత్రాలు జారీ చేయవద్దని ఆదేశించారు. అలాగే పుస్తక నిర్వాహకులు టాబ్ ఎంట్రీ ఆపరేటర్లు ఏ రోజు పూర్తి చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులు తట్టుకునేందుకు సెంటర్ వద్దనే పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతులకు ఇబ్బంది కాకుండా తగిన మంచినీరు ఏర్పాట్లు చూడాలని కేంద్రం వద్దనే టెంటు లేదా నీడ వచ్చే షెడ్డు మాదిరి నిర్మాణం చేయాలని సూచించారు. ప్రతిరోజు అందరూ నిర్వాహకులు సెంటర్లోనే ఉండి ఈ సీజన్లో అయిపోయేంతవరకు క్రమశిక్షణతో పనిచేసి విజయం సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎండి తాజుద్దీన్ మాట్లాడుతూ ఉంటారు అని ప్రతి ఏ ఈవో కి కూడా రెండు నుంచి మూడు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయని ఒక క్రమ పద్ధతి ప్రకారం ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు తేమశాతాన్ని పరిశీలించి టోకెన్లు జారీ చేస్తారని ఏఈవోల ద్వారా సూచించారు టోకెన్ల ఆధారంగా మాత్రమే కొనుగోలు చేయాలని సూచించారు. ఏఈఓ సర్టిఫికెట్ ఇవ్వని ఏ ఒక్క రైతు దాన్ని కూడా కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాగే ఏఈఓ లకు కూడా తగు సూచనలు పాటించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏపిఎం రవికుమార్ మాట్లాడుతూ జిల్లా అధికారులు మండల అధికారులు కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు పాటించి ఈ సీజన్లో కోరుతా నేను సేకరణ సజావుగా సాకేత్ దుకు అందరు క్రమశిక్షణతో పని చేయాలని సూచించారు. గన్ని బ్యాగుల విషయంలో వచ్చిన అన్ని బ్యాగులను మరుసటిరోజే చెక్ చేసుకుని పాడైపోయిన బ్యాగులను వెంటనే సివిల్ సప్లై కార్పొరేషన్ వారికి అందజేసిన పొందాలని తెలియజేశారు. సెంటర్లో మెడికల్ కిట్ మరియు మంచినీరు సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జిల్లా అధికారులతో నిత్యం సమన్వయం చేసుకుంటూ మండల అధికారులు కూడా కేంద్రాలకు విజిట్ చేసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే జిల్లా అధికారులు కేంద్రాలను పరిశీలించే సమయంలో సెంటర్ నిర్వాహకులు అందుబాటులో ఉండి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు రెవెన్యూ అధికారులు మండల సీసీలు వివోఏలు కేంద్రాల ఇన్చార్జి లు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily