Tuesday, 10 February 2026 09:09:24 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

హత్య కేసులో నిందితుల అరెస్ట్... పరువు తీస్తున్నాడని అంతమొందించారు. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసిపి గజ్జి కృష్ణ .

.


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 30 April 2025 02:26 PM Views : 1125

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఏప్రిల్ 29 అక్షరం న్యూస్ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు ఈ మేరకు ఏసిపి కృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామానికి చెందిన వేల్పుల సంతోష్ భార్య శైలజ తో సమీప బంధువు పెద్దపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన పోలం కుమార్ సన్నిహితంగా ఉండేవాడు భార్య తరచూ ఫోన్లో అతడితో మాట్లాడుతుండటంతో వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని సంతోష్ అనుమానించాడు ఈ విషయంమై ఆమెని మందలించాడు కుమార్ తన వెంట పడుతున్నాడని చెప్పిన శైలజ అప్పటి నుంచి అతడిని దూరం పెట్టింది అనంతరం అతని భార్య జోలికి రావద్దు అంటూ కుమారును సంతోష్ బెదిరించాడు ఈ విషయాన్ని కుమార్ బంధువులకు చెప్పడంతో శైలజకు తరచూ ఫోన్ చేస్తుండడంతో బంధువుల వద్ద పరువు పోతుందని సంతోష్ అతనిపై కోపం పెంచుకున్నాడు పథకం ప్రకారం మాట్లాడుకుందామంటూ పెద్దపల్లి మార్కెట్ యార్డ్ కు కుమారును పిలిచాడని తెలిపారు సంతోష్ జెండా వద్ద కత్తి కొనుగోలు చేసి తర్వాత భార్యను తీసుకొని అక్కడికి కలిసి వచ్చారని వ్యూహం ప్రకారం కుమార్ తొ గొడవ పడిన సంతోష్ కత్తితో అతడి మెడపై పొడిచాడు ఆ సమయంలో కుమార్ ఎదురు తిరగకుండా శైలజ అతని చేతులు పట్టుకుందని అనంతరం కుమార్ ముఖంపై చాతిపై సంతోష్ పొడిచాడని కుమార్ తప్పించుకునే క్రమంలో శైలజ తో పాటు సంతోష్ కు కూడా గాయాలయ్యాయని కింద పడిపోయిన కుమారుని సంతోష్ మరోసారి పొడిచి మెడ పొట్టపై నిల్చోని చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాతే అక్కడి నుంచి పారిపోయాడని వెల్లడించారు నమ్మదగిన సమాచారం ప్రకారం సిఐ ప్రవీణ్ కుమార్ సిబ్బందితో కలిసి నిందితులు సంతోష్ శైలజను ధర్మారం మండలం దొంగతుర్తి వారి ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు ఏసీపి గజ్జి కృష్ణ తెలిపారు వారి నుంచి హత్యకు ఉపయోగించిన కత్తి రక్తం మరకలు కలిగిన దుస్తులు రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :