AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దప్లల్లి రూరల్ నవంబర్ 24 అక్షరం న్యూస్ పెద్దపల్లి మండలం దేవునిపల్లి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం భక్తజన సందోహం, వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ దివ్య కల్యాణ వేడుకకు భక్తులు పోటెత్తారు. పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్, మంచిర్యాల జిల్లాల నుంచి వేలాదిమంది భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ ప్రాంగణం మార్మోగగా, దేవునిపల్లి గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. -భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ ఏర్పాట్లు కల్యాణ మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చిన నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈవో శంకర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. స్వామివారి దర్శనం, కల్యాణ మహోత్సవ నిర్వహణలో సమన్వయంతో వ్యవహరిస్తూ కార్యక్రమాలు సజావుగా జరిగేలా పర్యవేక్షించినట్లు పేర్కొన్నారు. ఆలయ సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలను నిర్వహించడంతో పాటు భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించామన్నారు. గ్రామపంచాయతీ పాలకవర్గం సైతం ఉత్సవ నిర్వహణలో సహకారం అందించింది. భక్తుల భద్రతకు పోలీసుల పటిష్ట బందోబస్తు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఏసీపీ జి. కృష్ణ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై, నాయిని మధుకర్ పోలీసు సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహించారు. భక్తుల రాకపోకలు, వాహనాల నియంత్రణతో పాటు ఆలయ పరిసరాల్లో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకునేలా పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహించారు. ఆధ్యాత్మిక శోభతో కళకళలాడిన దేవునిపల్లి దేవాదాయ శాఖ అధికారుల సమన్వయం, గ్రామపంచాయతీ పాలకవర్గం సహకారం, పోలీసుల పటిష్ట బందోబస్తు నడుమ శ్రీ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. వేలాదిమంది భక్తుల రాకతో దేవునిపల్లిలో పండుగ వాతావరణం నెలకొంది. స్వామివారి దివ్య కల్యాణాన్ని తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగితేలారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. ఈ సందర్బంగా పలువురు నాయకులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
.
Aksharam Telugu Daily