Saturday, 18 April 2026 06:43:32 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఈ నెల 24న వైరాలో టియుడబ్ల్యుజె (ఐజెయు) ఖమ్మం జిల్లా మహాసభ.. *మంత్రులను,అధికారులను ఆహ్వానించిన ఐజెయు నేతలు*... *సభకు ఖమ్మం జిల్లా జర్నలిస్టులంతా తరల


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 22 July 2025 08:32 PM Views : 911

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్/జూలై 22 (అక్షరంన్యూస్)* (టియుడబ్ల్యుజె-ఐజెయు) జిల్లా మహాసభలు ఈనెల 24న వైరా పట్టణంలో జరుగుతున్నాయని ఈ సభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులంతా పాల్గొన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు,కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్ రావు ఒక ప్రకటనలో కోరారు.ఈ మహాసభకు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క్,రాష్ట్ర సమాచార ,రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తోపాటు జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంపిలు,ఎమ్మెల్యేలు,జిల్లా కలెక్టర్ దురిశేట్టి అనుదిప్,జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్, టియుడబ్ల్యుజె (ఐజెయు ) రాష్ట్ర అధ్యక్షులు వీరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె రాంనారాయణ ఇతర జాతీయ,రాష్ట్ర నాయకులు పాల్గొంటారని వారు తెలిపారు.ఈ సభకు వైరాలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని పేర్కోన్నారు.మంగళవారం వైరాలో శభరి గార్డెన్ లో సభవేధికను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశేట్టి, జిల్లా పోలీస్ కమీషనర్ సునీల్ దత్ ను కలిసి వారిరువురిని విశిష్ట అతిధులుగా ఆహ్వానించడం జరిగిందన్నారు.అదేవిధంగా జిల్లా సమాచార ,పౌరసంబంధాల శాఖ అధికారి ఎండి గౌస్ అలీని కూడా అతిధిగా ఆహ్వానించామన్నారు.గడిచిన ఆరవై ఏళ్ళ నుంచి జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం కోసం పోరాడుతున్న ఐజెయు మహాసభల్లో జర్నలిస్టులంతా పాల్గొన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యుజె ఐజెయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాటేటి వేణుగోపాల్ రావు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ సామినేని మురారీ,రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు నర్వనేని వెంకట్రావ్,సీనియర్ జర్నలిస్ట్,ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ నల్లజాల వెంకట్రావ్,నగర అధ్యక్ష కార్యదర్శులు చెరుకుపల్లి శ్రీనివాస్,జనార్ధన చారి,కోశాధికారి ఏలూరి వేణు,ప్రెస్ క్లబ్ కోశాధికారి కళ్యాణ్ ,బుర్రి శ్రీనివాస్ ,వైరా ఆహ్వాన కమిటి అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి రాజారావు, ఎన్ టి వి శ్రీను,ఐ న్యూస్ రవి తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :