Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / జూన్ 11/ అక్షరం న్యూస్ -: పీవీకే 5 ఇంక్లైన్ నందు ఐ ఎన్ టీ యు సి పిట్ సెక్రటరీ చిలక రాజయ్య అధ్యక్షతన కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ రజాక్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ గని ఆవరణలో జరిగినది. ఈ గేట్ మీటింగ్ కు ముఖ్య అతిధులుగా ఐ ఎన్ టీ యు సి సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్, కేజీఎం ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్ హాజరైనారు. ఈ సమావేశం లో వక్తలు మాట్లాడుతూ కార్మికులు ఆశీర్వదించి ఐ ఎన్ టీ యు సి నీ ఆరు ఏరియాలలో గెలిపించడం జరిగినది అని ప్రాతినిధ్య సంఘంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనీ తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారంతో అనేక కార్మిక హక్కులను సాధించడం జరిగినది. కార్మికునికి ఏ సమస్య వచ్చిన ఐ ఎన్ టీ యు సి యూనియన్ అందుబాటులో ఉంటుందని కార్మికులకు తెలిపినారు. కేజీఎం ఏరియా లో కార్మికునికి ఏ సమస్య వచ్చిన ఆ సమస్యల పరిష్కారమే ద్యేయంగా ఐ ఎన్ టీ యు సి యూనియన్ పనిచేస్తుందని తెలిపినారు. కేజీఎం ఏరియా లో వున్న ఖాళీ లను వెంటనే భర్తీ చేయాలనీ యాజమాన్యాన్ని కోరినారు. అదేవిదంగా అబ్సెంటిజం కౌన్సిలింగ్ కు హాజరైన వివిధ రకాల తీవ్ర వ్యాధులతో బాధపడుతున్న అనేక మంది కార్మికులు కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. వారి అందరిని మెడికల్ బోర్డు కు రెఫెర్ చేసి అన్ఫిట్ అయేవిదంగా యాజమాన్యం చొరవ చూపాలని కోరినారు. కార్మికుల సొంత ఇంటి కల, 20 లక్షల వడ్డీలేని ఋణం, లాంటి అనేక సమస్యలు పెండింగ్ లో వున్నాయి. వీటిని పరిష్కరించే భాద్యత గుర్తింపు సంఘం ఏ ఐ టీ యు సి యూనియన్ దే అని కార్మికులకు గుర్తుచేసినారు. స్వతంత్రం పూర్వం ఐ ఎన్ టీ యు సి జాతీయ యూనియన్ ను ఈ దేశ మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా స్థాపించడం జరిగినది. ఐ ఎన్ టీ యు సి జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి నాయకత్వంలో, సెక్రటరీ జనరల్ జానక్ ప్రసాద్ ఆధ్వర్యంలో అనేక సింగరేణి కార్మిక హక్కులను సాధించిన చరిత్ర ఐ ఎన్ టీ యు సి యూనియన్ దని మనవి చేసినారు. డిపెండెంట్స్ వయసును 40 సంవత్సరాలు కు సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం సహకారంతో మా యూనియన్ సాధించినదని అదేవిదంగా సింగరేణిలో. మహిళ లకు 33%రిజర్వేషన్ లను సాధించడం జరిగినది. సింగరేణిలో అనేక పెండింగ్ సమస్యలను మానేజ్మెంట్ తో మాట్లాడి పరిష్కారం చేయడంలో గుర్తింపు సంఘం ఏ ఐ టీ యు సి విఫలం అయినదనీ తెలిపినారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో భాగస్వామిగా సి పి ఐ అనుబంధ సంఘంగా ఏ ఐ టీ యు సి మాతో కలసి వస్తే ఉమ్మడిగా కలసి వెళ్లి మేనేజ్ మెంట్ తో, ప్రభుత్వం తో మాట్లాడి కార్మిక సమస్యలు పరిష్కరిద్దామని ఏ ఐ టీ యు సి కి హితవు పలకడం జరిగినది. చివరిగా బ్రాంచ్ సెక్రటరీ బి సైమన్ మీటింగ్ ను శ్రద్దగా విని విజయవంతం చేసిన అందరికి పేరుపేరున ధన్యవాదాలు తెలిపినారు. ఈ సమావేశంలో పాల్గొన్నవారు. డిప్యూటీ జనరల్ సెక్రటరీ బూటుక రాజేశ్వరావు, బ్రాంచ్ సెక్రటరీ లు సైమన్, మెంగన అశోక్, సెంట్రల్ కమిటీ సభ్యులు సకినాల సమ్మయ్య, పోశం శ్రీను, మల్లారపు కొమరయ్య, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ కె గౌస్, కల్వల శ్రీనివాస్, గోపు కుమార్, సత్తార్ పాషా,వై శంకర్, వల్లలా సాంబమూర్తి, రామస్వామి, కొమ్ము సాంబయ్య,సాయి ప్రసాద్, శివ క్రిష్ణ, సీతారాం, ఘన్ శ్యామ్, వీరన్న,సవీర్, ఎన్ వెంకటేశ్వరావు, ప్రశాంత్, వినయ్, జె రవి, చిరంజీవి, మధుసూదన్, రమాకాంత్, కృష్ణమూర్తి, ప్రభాకర్,బాలు, ఎన్ శంకర్, హరియా, రామ్మోహరావు,అరుణ్, రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily