GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల/ముస్తాబాద్/అక్టోబర్-29(అక్షరం న్యూస్) ముస్తాబాద్ మండల వ్యాప్తంగా మొంథా తుఫాన్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో స్వల్పకాలిక రకాలైన వరి వంగడాలను కొద్దిగా గొప్ప వరి కోతలు కోసిన రైతులు తమ ధాన్యాన్ని ఉదయం పూట ఆరవస్తు సాయంత్రం పూట పోగుచేస్తూ అవస్థలు పడుతున్నారు. సాధారణంగా రైతులు ఒకసారి ధాన్యాన్ని ఆరబోస్తే పూర్తిగా ఆరినాక కుప్పగా చేసుకొని శుభ్రం చేసుకుంటారు. తుఫాన్ ప్రభావంతో పరిస్థితులు అంతగా అనుకూలంగా లేకపోవడంతో ఆకాశంలో మబ్బులు వస్తుండడంతో ఎక్కడ ధాన్యం తడిసిపోతుందో వర్షపు వరదలకు కొట్టుకుపోతుందో అన్న భయం రైతులను వెంటాడుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో ఓపెన్ కాకపోవడం వర్షం పడితే కప్పడానికి టార్పాలిన్స్ లేకపోవడం లేక రైతులు అవస్థ పడుతున్నారు. చేతి కాడికి వచ్చిన పంట నోటి నోటి దాకా రాదేమోనన్న భయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. తుఫాను ప్రభావం మరో రెండు మూడు రోజులు ఉంటుందన్న వార్త కథనాలతో రైతులు హడలిపోతున్నారు. మరికొంత ఏరియాలో వరి కోతలు కోసేందుకు సిద్ధంగా ఉండడంతో తుఫాన్ అలెర్ట రైతులు కోతలను నిలిపివేశారు. మొంథా తుఫాన్ ప్రభావంతో రైతులను తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల పంట తడిసిపోతుంది. మరికొందరూ ఆరబెట్టుకోవాలని ధాన్యం కొనుగోలు వద్దకు వస్తే.. ధాన్యం ఆరేది ఏమో కానీ తడిసేదే ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఖరీదు చేసిన ధాన్యాన్ని కాంట వేయించి వెంటనే తరలించే విధంగా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు మొత్తానికి మొంథా తుఫాన్ రైతులను కన్నీరు పెట్టించేందుకే వస్తుందని వాపోతున్నారు రైతులు
.
Aksharam Telugu Daily