D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ నవంబర్ 20 (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత,వితంతు మరియు ఒంటరి మహిళల పెన్షన్లు మొత్తం 26 మందికి అందాయి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , వైరా ఎమ్మెల్యే మాలోతూ రాందాస్ నాయక్ మున్సిపాలిటీ చైర్మన్ కాపా చంద్రకళ మురకృష్ణ సహకారంతో 20వ వార్డుకు 26 నూతన పెన్షన్లు మంజూరు కావడం పట్ల వార్డు ప్రజల తరఫున ఎమ్మెల్యే కి కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యామ్ బాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఉండ్రు వరలక్ష్మి శ్యామ్ బాబు మాట్లాడుతూ పేదలకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు ప్రభుత్వం అందించే పెన్షన్లు ఎంతో భరోసానిస్తున్నాయని, వారి జీవితాల్లో ఆర్థికంగా కొంత చేయూతనిస్తూ కుటుంబాలకు, అండగా, నిలుస్తున్నాయని తెలిపారు.అనంతరం కౌన్సిలర్ ఉండ్రు వరలక్ష్మి శ్యామ్ బాబు తన చేతుల మీదుగా 26 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్ మంజూరు పత్రాలను అందజేసి, వారందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో వార్డ్ కాంగ్రెస్ నాయకులు వంకడోత్ బిక్యా, పండు,దుర్గా , ఎస్ కె రహీం, నాగేశ్వరరావు, నాగమణి, నర్సింహారావు, తదితరులు పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily