AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 11/అక్షరం న్యూస్/---- కొయ్యూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా చర్ల ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్ర పరిధిలోని 56 అంగన్వాడి సెంటర్లు 40 గవర్నమెంట్ స్కూల్స్ కే జీ బీవీ ఏకలవ్య స్కూల్ ప్రైవేట్ స్కూళ్ల లో ఒక సంవత్సరం మొదలుకొని 19 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ నులిపురుగుల నివారణ కొరకు కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరిగినది. డాక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ చర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మొత్తం ఒక సంవత్సరం మొదలుకొని 19 సంవత్సరాల విద్యార్థులు 5535 మంది ఉండగా అందులో 98 శాతం మందికి ఆల్బెండజోల్ టాబ్లెట్ మింగించటం జరిగినది. వివిధ కారణాలతో స్కూలు కి రాలేకపోయిన విద్యార్థుల కొరకు 18 వ తారీఖున మాప్ అప్ డే ఉంటుంది. ఆరోజు మిగిలిన విద్యార్థులు కూడా ఆల్బెండజోల్ టాబ్లెట్లు మిగించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల చురుకుదనానికి రక్తహీనత నివారణకు ఈ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని కనుక ఏ ఒక్క విద్యార్థి ఈ టాబ్లెట్ వేసుకోకుండా ఉండకూడదు అని తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మొబైల్ డాక్టర్ సచిన్ ఆర్ బి ఎస్ కే వైద్యులు డాక్టర్ సందీప్ డాక్టర్ స్ఫూర్తి, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily