AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు, అక్షరం న్యూస్ /సెప్టెంబర్ 4; బూర్గంపాడు మండల పరిధిలోని ముసలమడుగు గ్రామపంచాయతీ లో ఉన్న చెరువు సింగారం ఎస్టీ కాలనీలో ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బూర్గంపాడు మండల సమితి మరియు జిల్లా నాయకులు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఫారెస్ట్ వారు గిరిజన మహిళ తాటి కాసులమ్మకు చెందిన పత్తి పంటను, పీకిన రెండు ఎకరాల పత్తిని చూడడం జరిగింది. మరియు స్థానికులను అడిగి జరిగిన సంఘటన విచారించడం జరిగింది. ఫారెస్ట్ వారు దౌర్జన్యాలకు పాల్పడుతూ మా పంట పొలాలను నాశనం చేస్తూ మమ్మలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పినారు. అందులోని భాగమే ఫారెస్ట్ వారు ఒంటెద్దు పోకడలు మానుకొని గిరిజనులపై దాడులు ఆపాలని ఫారెస్ట్ వారిని సిపిఐ పార్టీ హెచ్చరించడం జరిగింది. మరియు తాటి కాసులమ్మ రెండు ఎకరాల పత్తి పంటను పీకేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మువ్వా వెంకటేశ్వరరావు( లడ్డ ), వ్యవసాయ కార్మిక సంఘం BKMUజిల్లా ఉపాధ్యక్షులు పేరాల శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెరువు సింగారం గ్రామం లో తాటి కాసులమ్మ అనే ఆదివాసీ గిరిజన మహిళ భర్త చనిపోవడంతో ఒంటరి మహిళ, ఐదుగురు అడపిల్లలతో ఆమె జీవనం కొనసాగిస్తుంది. 2007సంవతసరంలో నాలుగు ఎకరాల పోడు భూమికి అటవీ హక్కుల చట్టం ప్రకారం హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నది,2009 సంవత్సరం లో అటవీ హక్కుల జిల్లా స్థాయి కమిటీ ఆమోదించి హక్కు పత్రం ఇచ్చింది.కానీ సెప్టెంబర్ 1 వ తేదీన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లయిన కోండ్రు నాగరాజు, రామ్మూర్తి లు తాటి కాసులమ్మ రెండు ఎకరాల పత్తి చేనులో అక్రమంగా జొరబడి పత్తి మొక్కలు పీకేసినారు.దీంతో పత్తి పంట పై ఆధారపడి జీవిస్తున్న కాసులమ్మకు తీవ్ర నష్టం వాటిల్లింది. కావున ఆమెకు ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పత్తి చేను పీకిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సబ్కా నాగేశ్వరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యులు అలవాల సీతారామరెడ్డి, మండల సహాయ కార్యదర్శి పాండవుల బిక్షం.సిద్దారపు సుబ్బారెడ్డి .సీనియర్ నాయకులు శంకర్ రెడ్డి .ఎస్ పుల్లయ్య,రాంబాబు, జనార్దన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily