Wednesday, 29 July 2026 10:27:43 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వరద పరిస్థితులను పరిశీలించిన

జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శిథిలావస్థ ఇళ్లలో ఉండొద్దు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కోయ శ్రీహర్ష


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 29 July 2026 02:38 PM Views : 40

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 29 అక్షరం న్యూస్ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి రాజీవ్ రహదారి వద్ద వరద ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం పరిశీలించారు. వరద పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకుని ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న రెండు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ నివసించవద్దని, అలాంటి కుటుంబాలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా ఎక్కడైనా నీరు నిల్వ ఉండటం, వరద ముప్పు ఏర్పడటం వంటి పరిస్థితులపై నిరంతరం నిఘా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్‌కు కలెక్టర్ సూచించారు. మున్సిపల్ సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించారు. పరిశీలన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు పూదరి మహేందర్, తోట ఫణీందర్, అక్కపల్లి క్రాంతి సుజాత, నదీమ్, తూముల లత సుభాష్, మొలుగురి కమల్, టౌన్ ప్లానింగ్ అధికారులు నరేష్, వినయ్, జూనియర్ అసిస్టెంట్ రమాకాంత్, వార్డు అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :