GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / జనగామ/రఘునాథపల్లి : జనగామ జిల్లా/రఘునాథపల్లి/( అక్షరం న్యూస్ ) సెప్టెంబరు 13: లంబాడ హక్కుల పోరాట సమితి మండల కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో జరిగిన లంబాడ హక్కుల పోరాట సమితి సమావేశంలో నూతన మండల కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా భూక్యా మాల్యనాయక్, ఉపాధ్యక్షులుగా బానోతు మహేందర్, నేతావత్ వీరన్న, ప్రధాన కార్యదర్శిగా మాలోతు నర్సింహా, అధికార ప్రతినిధిగా మోహన్, కోశాధికారిగా మూడు దర్శ, సోషల్ మీడియా ఇన్చార్జిలుగా తిరుపతి, రాజు, సంతోష్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికయిన కమిటీ అధ్యకుడు మాల్యనాయక్ ను లంబాడ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు అభినందించారు. కార్యక్రమంలో భూక్యా హుస్సేన్, బానోతు వెంకట్ నాయక్, కొర్ర సక్రు,జేతిరామ్, బన్ సూర్య, రాందాస్, జెట్ మాల్ , దేవస్వామి, శంకర్, బిచ్చ, చందర్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily