Thursday, 06 August 2026 02:46:14 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

గ్రామాలలో మంచినీటి సమస్య పరిష్కారానికి శాశ్వత కృషి రైతులకు సకాలంలో నీరు అందేలా కాలువల పూడికతీత..* విద్య ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వ పాఠశాలలో మౌలి

గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల బాధ్యత కీలకం. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో * ప్రభుత్వ విప్, చింతకుంట విజయరమణ రావు..


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 05 August 2026 06:18 PM Views : 25

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ఆగస్టు 05 అక్షరం న్యూస్ సుల్తానాబాద్ మండల సర్వసభ్య సమావేశ మందిరంలో ఎంపీడీవో దివ్యదర్శన్ రావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తో కలిసి పాల్గొన్న ప్రభుత్వ విప్. చింతకుంట విజయరమణ రావు ఈ సందర్బంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ... సమావేశంలో మండలంలోని గ్రామాల సర్పంచులు తెలియజేసిన గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామాలలో తాగునీటి సమస్యలను సర్పంచులు ప్రస్తావించగా సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అని తెలియజేశారు. ప్రజల త్రాగునీటికీ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత డి.ఈ, ఏ.ఈ లకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. మండలంలో రైతులకు సకాలంలో ఎస్సారెస్పీ కాలువల ద్వారా నిరందించేలా పూడికతీతలు తీసి నీరు అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. గత 40, 50 సంవత్సరాలుగా కాలువలు కూడుకుపోయి రైతులు ఇబ్బందులు ఎదుర్కున్నారని దాదాపు 2000 ఎకరాలకు నీరు అందేలా నూతనంగా ఎన్నికైన సర్పంచుల సహకారంతో జెసిబిలతో కాల్వలను పూడిక తీపించడం జరిగిందని వివరించారు. అలాగే నియోజకవర్గంలో 50 కోట్ల రూపాయలతో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులైన బాత్రూమ్లు, ప్రహరీల నిర్మాణం, పాస్ ఏరియాల, మంచినీటి సౌకర్యాల కల్పనకు కృషి చేశామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతిలో సుల్తానాబాద్ మండల టాపర్ గా స్థానిక జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు చెందిన సిరివల్లి క 585 మార్కులతో జిల్లా టాపర్గా నిలిచారని ఇంటర్మీడియట్ లో వి. సౌమ్య 1000 మార్కులకు 994 మార్కులు సాధించి రాష్ట్ర టాపర్ గా నిలవడం గర్వకారణమని తెలిపారు. వివిధ ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారని ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతాన్ని పెంచే విధంగా సర్పంచులు కృషి చేయాలని సూచించారు. విద్య రంగంపై జిల్లా కలెక్టర్ మరియు మేము ప్రత్యేక దృష్టి సారించడం వల్లే ఫలితాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో వసతుల కల్పనపై లిఖితపూర్వకంగా మండల విద్యాధికారి, ఎం.పీ.డీ.వో లకు సర్పంచ్ లు దరఖాస్తులు వ్రాసి అందించాలని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం సమావేశం వివిధ అంశాలపై కొనసాగించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, తాసిల్దార్ బషీరుద్దీన్, ఎంపీడీఓ దివ్య ధర్షన్ రావు, మండలంలోని సర్పంచులు, సింగిల్ విండో చైర్మన్లు, చిలుక సతీష్, కల్లేపల్లి జానీ, మురళిధర్ రావు, భాస్కర్ రెడ్డి, నమని రాజిరెడ్డి,అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు మరియు పలువురు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :