D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT. Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్ జిల్లా/గంగారం : మహబూబాబాద్ జిల్లా/ గంగారం/ అక్టోబర్ 3(అక్షరం న్యూస్) గంగారం మండల కేంద్రంలో కోమట్లగూడెం నేతకానికాలనీలో శివాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాత విగ్రహాల శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గామాత తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన దుర్గామాతను భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. యూత్ కమిటీ వారు ప్రత్యేకంగా అలకరించిన వాహనంలో అమ్మవారి విగ్రహాన్ని ఉంచి శుక్రవారం రోజున జరిగిన ఊరేగింపులో గ్రామంలో ని మహిళలు, పెద్దలు, యువతీ యువకులు అటపాటలు, నృత్యాలు చేస్తు అంగరంగ వైభవంగా ఊరేగింపు సాగింది . యూత్ సభ్యులు అమ్మవారి చీరలు, లడ్డు వేలం వేయగా భక్తులు అధిక సంఖ్యలో పోటీ పడ్డారు.ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, మహిళలు, శివాజీ యువజన సంఘం సభ్యులు అధిక సంఖ్య లో పాల్గొన్నారు
.
Aksharam Telugu Daily