Thursday, 21 May 2026 09:41:01 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

​రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి _కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య

.


D MURALI , GANGARAM MANDAL, MAHBUBABAD DISTRICT.

Reporter

Date : 21 May 2026 02:58 PM Views : 36

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మహబూబాబాద్/కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా/ కొత్తగూడ/ మే21(అక్షరం న్యూస్ ) కొత్తగూడ మండలం లోని భారతదేశ సాంకేతిక విప్లవ పితామహుడు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి (ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం) సందర్భంగా కొత్తగూడ మండల కేంద్రంలో ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య మాట్లాడుతూ భారతదేశాన్ని ఆధునిక ప్రపంచం వైపు నడిపించిన గొప్ప దూరదృష్టి గల నాయకుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో నేడు మనం చూస్తున్న ఐటీ, టెలికాం విప్లవానికి ఆయనే పునాది వేశారని గుర్తుచేశారు యువతకు పెద్దపీట: దేశ రాజకీయాల్లో యువత పాత్ర కీలకమని భావించి, ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత రాజీవ్ గాంధీదేనని వజ్జ సారయ్య పేర్కొన్నారు పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలకు అధికారాలను బదిలీ చేసి, గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం ఇచ్చిన మహోన్నతుడు రాజీవ్ గాంధీ అని కొనియాడారు ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ: దేశ ఐక్యత, సమగ్రత కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరవీరుడు రాజీవ్ గాంధీ అని, ఆయన వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చేశారు ​రాజీవ్ గాంధీ చూపిన బాటలో నడుస్తూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరియు ప్రజా సంక్షేమానికి ప్రతి ఒక్క కార్యకర్త కట్టుబడి ఉండాలని వజ్జ సారయ్య పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ చల్ల నారాయణ రెడ్డి జిల్లా నాయకులు బానోత్ రూపుసింగ్, వీరనేని వెంకటేశ్వర్లు,మాజీ వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య,బ్లాక్ జనరల్ సెక్రటరీ కాయితోజు ఉపేంద్ర చారి,INTUS అధ్యక్షులు నామోజు కృష్ణ, చారి,జిల్లా నాయకులు నోముల ప్రశాంత్,యూత్ మాజీ అధ్యక్షులు బోయినేని ప్రశాంత్ రెడ్డి,యూత్ మండల అధ్యక్షులు చొప్పరి కుమార్,నాయకులు డా "దేవర శ్యామ్ సుందర్, వెలుదండి వేణు, చెన్నురి మహేందర్, రవి సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్,యూత్ సోషల్ మీడియా భూక్యా రాజు, సోలం వెంకన్న, యాదగిరి కిరణ్,కాంగ్రెస్ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ​

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :