GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్ పెద్దపల్లి జిల్లా, జూన్ 25 అక్షరం న్యూస్: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది సమాజ బాగా స్వామ్యం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో విద్యార్థులకు దాతల సహాయంతో ఏర్పాటు చేసిన విద్యా సామాగ్రిని ప్రధానోపాధ్యాయులు రాజారాం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ఎమ్మార్వో పుల్లూరి జగదీశ్వర్ రావు ,ఎంఈఓ సిరిమల్ల మహేష్ పాల్గొని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విద్యా సామాగ్రి విద్యా దాతలు నరెడ్ల వీరలక్ష్మీ, రిటైర్డ్ టీచర్, భూసారపు కృష్ణ,సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీ.శే.ప్రతాప లక్ష్మీ , హుజురాబాద్ వాస్తవ్యుల సహకారంతో నోట్ బుక్స్, బ్లూ, బ్లాక్ పెన్నులు, పెన్సిల్స్, షార్పెనర్స్, రబ్బర్ లను వారి సొంత ఖర్చులతో అందజేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు చక్కగా క్రమశిక్షణతో చదువుకొని పాఠశాలకు తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అలాగే తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోని సౌకర్యాలను వినియోగించుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పించే మంచి నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయుల సేవలు ఉపయోగించుకోవాలని, సమాజ భాగస్వామ్యం పెరగాలని కోరారు.పాఠశాలలో గత సంవత్సరం ఉన్న విద్యార్థుల సంఖ్య 17 నుండి ఈ సంవత్సరం 35 మంది విద్యార్థుల సంఖ్య పెంచినందుకుగాను పాఠశాల ప్రధానోపాధ్యాయులను,ఉపాధ్యాయులను ఎంఈఓ,ఎంఆర్ఓ, ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలోఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు జయ్ కుమార్, శ్రీలత, తల్లిదండ్రులు,ఏ ఎమ్ సి చేర్మెన్ టి.మౌనిక,సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily