Wednesday, 14 October 2026 04:25:30 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రీసర్వే పనులను పకడ్బందీగా పూర్తి చేయాలి..... అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి

భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలి.. రీసర్వేలో తప్పులకు తావులేకుండా పారదర్శకంగా భూ వివరాల నమోదు..


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 13 October 2026 06:07 PM Views : 68

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ అక్టోబర్ 13 (అక్షరం న్యూస్) జిల్లాలో భూముల రీసర్వే పనులను పకడ్బందీగా, నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం పెనుబల్లి మండలం తుమ్మలపల్లి రెవెన్యూ గ్రామం, కల్లూరు మండలం రఘునాధగూడెం రెవెన్యూ గ్రామం, తల్లాడ మండలం లక్ష్మీపురం రెవెన్యూ గ్రామాల్లో జరుగుతున్న రీసర్వే పనులను అదనపు కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆయా గ్రామాల్లో సర్వే పనుల పురోగతిని సమీక్షించి, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ రీసర్వేలో భాగంగా భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లు తదితర వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. భూ రికార్డుల్లోని వివరాలను క్షేత్రస్థాయి పరిస్థితులతో సరిపోల్చి, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నమోదు చేయాలని ఆదేశించారు. రీసర్వే ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, రైతులు, భూ యజమానులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని తెలిపారు. భూములకు సంబంధించిన వివరాలపై అభ్యంతరాలు లేదా సందేహాలు వ్యక్తమైతే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సర్వే బృందాలు సమన్వయంతో పనిచేస్తూ, నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు రీసర్వే పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ, రోజువారీ పురోగతిని సమీక్షించాలని, పనుల్లో జాప్యం జరగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట తల్లాడ, పెనుబల్లి, కల్లూరు తహశీల్దార్లు కె. కరుణాకర్ రెడ్డి, జి. వీరభద్ర నాయక్, కె. బ్రహ్మశ్వర రావు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :